సరిత మూడున్నర దశాబ్దాల క్రితం సౌత్ ఇండియాలో ఓ స్టార్ హీరోయిన్. కె. బాలచందర్ దర్శకత్వం వహించిన మరో చరిత్ర సినిమాతో చిన్న వయస్సులోనే ఓ ఊపు ఊపేసింది. ఆ వయస్సులో కమల్‌తో పోటీ పడి మరీ ఆమె చేసిన నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. నిజం చెప్పాలంటే ఆమె మరో చరిత్ర సినిమా చేసే టైంకు ఆమె వయస్సు 14 ఏళ్లు. అప్పుడు ఆమె 8వ తరగతి చదువుతున్నారు. మరో చరిత్ర హిట్ అవ్వడంతో ఆ తర్వాత అక్కడితోనే ఆమె చదువుకు ఫుల్‌స్టాప్ పెట్టేశారు.
సరిత మళయాళ నటుడు ముఖేష్‌ను ప్రేమ వివాహం చేసుకుంది. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు. అయితే పిల్లలు పెద్దవాళ్లు అయ్యాక ముఖేష్‌తో సరిత విడాకులు తీసుకుంది. ముఖేష్ తనను మోసం చేసి విడాకులు తీసుకున్నాడని.. తనకు విడాకులు ఇవ్వకుండానే మరో పెళ్లి చేసుకున్నాడని సరిత వాపోయింది. అతడు నాకు కరెక్ట్ కాదన్న విషయం తర్వాత అర్థమైందని.. మా ఇద్దరి మధ్య ఎప్పుడూ ఆప్యాయత, అనురాగాలు లేవు అని చెప్పింది.
తనను మోసం చేసి డైవర్స్ పేపర్స్‌పై సంతకాలు పెట్టించుకున్నాడని.. తామిద్దరం సెలబ్రిటీలం.. తాము విడాకులు తీసుకుంటున్నామని… తీసుకుంటామన్న వార్త ఏ మీడియాలోనూ రాలేదు. ఇందుకు ఆయన చేసిన మోసమే కారణమని సరిత వాపోయింది. తాను కేసు పెడితే ఏడేళ్లు జైళ్లోనే ఉండిపోతాడు. కానీ తాను అలా చేయలేదని.. తాను ఏ లాయర్‌ను అపాయింట్ చేసుకున్నా వాళ్లను కొనేస్తున్నాడని.. తన వైపు ఎవ్వరూ నిలబడలేదని సరిత ఆవేదనతో తన బాధ వ్యక్తం చేసింది.
తనకు జరిగిన అన్యాయం కంటే.. ఈ వ్యవస్థ ఇలా ఉన్నందుకు తనకు ఎక్కువ బాధ కలిగిందని కూడా సరిత ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. ఇక నా ఇద్దరు కొడుకులే నాకు ధైర్యం అని.. వాళ్ల కోసమే తాను బతుకుతున్నాను అని చెప్పింది. నా లాంటి సెలబ్రిటీకే ఈ పరిస్థితి ఉంటే ఇక మామూలు వాళ్లకు ఏం న్యాయం జరుగుతుందని కూడా సరిత ప్రశ్నించింది.
ఇక తన బాధ బయటకు పంచుకున్నా కూడా రాకుండా అడ్డుకుంటున్నారని.. కేరళలోని ఓ ప్రముఖ దినపత్రిక వాళ్లు తనతో పాటు తన ఇద్దరు పిల్లలను 5 గంటల పాటు ఇంటర్వ్యూ చేశారని.. ఆ తర్వాత మమ్మలను ఇంటర్వ్యూ చేసిన అమ్మాయి ఫోన్ చేసి మా ఎడిటర్‌తో మీ ఆయన ఫోన్లో మాట్లాడారని చెప్పిందని.. అప్పుడే ఆ ఇంటర్వ్యూ బయటకు రాదన్న విషయం తనకు అర్థమైందని సరిత చెప్పింది. ముఖేష్ లా చదువుకోవడంతో అతడి క్లాస్‌మెట్స్ అందరూ లాయర్లు, జడ్జ్‌లు, పోలీసులు కావడంతో తాను ఎంత పోరాడినా ప్రయోజనం ఉండదన్న విషయం తనకు అర్థమైందని చెప్పింది.