ప్రభాస్ అంటే మర్యాద.. మర్యాద అంటే ప్రభాస్ అన్నట్టుగా ఉంది. తన సినిమాల్లో నటించే హీరోయిన్లు, ఇతర నటీనటులు, టెక్నీషియన్లను ప్రభాస్ తన ఇంటి ఫుడ్‌తో చూపిస్తోన్న మర్యాదలు మామూలుగా లేవట. మామూలుగానే గోదావరి రుచులు ఎలా ? ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రభాస్ షూటింగ్ ఎక్కడ జరుగుతున్నా కూడా అక్కడ ఏపీ నుంచి ఓ కుక్ మాస్టర్‌ను తీసుకువెళ్లి మరీ ప్రతి రోజూ భారీ ఎత్తున వంటకాలు వండిస్తారట. ఆ వంటల రుచి అందరికి చూపిస్తూ ప్రభాస్ అంటే ఫుడ్‌తో ఎంత రాజమర్యాదలు చేస్తారో ? ఎప్పుడూ ఫ్రూవ్ చేసుకుంటూ ఉంటాడు.
ఓ సారి బిల్లా షూటింగ్ మలేషియాలో జరుగుతున్నప్పుడు అక్కడకు ఏపీ కుక్‌ను తీసుకువెళ్లి మరీ షూటింగ్ జరగినన్ని రోజులు అతడితోనే వంటకాలు చేయించాడు. అదే టైంలో ఎన్టీఆర్ సినిమా షూటింగ్ అక్కడ జరుగుతుంటే ఎన్టీఆర్‌ను పిలిచి మరీ తన వంటలతో మర్యాదలు చేయడంతో ఎన్టీఆర్ సైతం కృష్ణంరాజు, ప్రభాస్‌ను ఉద్దేశించి మీ తండ్రి కొడుకులు ఇక్కడ కూడా ఫుడ్ పెట్టి చంపేస్తారని కాంప్లిమెంట్ ఇచ్చాడు.
ఇక తనతో నటించిన హీరోయిన్లలో అనుష్క – శ్రద్ధా కపూర్ – పూజా హెగ్డే, శృతీహాసన్ ఇలా చాలా మంది ప్రభాస్ ఫుడ్ ఆతిధ్యాన్ని స్వీకరించి ప్రశంసలు కురిపించిన వాళ్లే. ఇటీవల రాధేశ్యామ్‌లో ప్రభాస్‌కు తల్లిగా నటించిన భాగ్య శ్రీ సైతం ప్రభాస్ ఇంటివంట టేస్ట్ చేసి మెస్మరైజ్ అయిపోయానని చెప్పింది. ఇక ఇప్పుడు మరో హాట్ హీరోయిన్ కూడా ప్రభాస్ ఫుడ్ పార్టీలో పాల్గొని వావ్ అంటూ ప్రశంసలు కురిపించేసింది.
ప్రభాస్ తాజాగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ కే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో దీపికా పదుకొనే హీరోయిన్. ఇక మరో హీరోయిన్గా మరో హాట్ బ్యూటీ దిశా పటానీ నటిస్తోంది. ఇప్పటికే దీపికాకు ప్రభాస్ రెండు, మూడు సార్లు ఫుడ్ పార్టీ ఇచ్చేశాడు. ఆమె అప్పుడే తబ్బిఉబ్బయిపోయింది. ఇప్పుడు దిశా అలా సెట్స్‌లోకి ఎంట్రీ ఇచ్చిందో లేదో ప్రభాస్ ఫుడ్ పార్టీ తనకు చాలా స్పెషల్ అని చెప్పింది.
ఏదేమైనా ప్రభాస్ సినిమా అంటే హీరోయిన్లకు ఫుల్ మీల్సే. తిండి విషయంలో కృష్ణంరాజు రాజీపడేవారే కాదని గతంలో పేరు ఉండేది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఇప్పుడు ప్రభాస్ కూడా కృష్ణంరాజు వారసత్వం కంటిన్యూ చేస్తూ ఇలా వరుసగా వార్తల్లో ఉంటున్నాడు.