టాలీవుడ్‌లో కామెడీ సినిమాల స్పెషలిస్ట్‌గా దివంగత ఈవీవీ సత్యనారాయణకు తిరుగులేని పేరు ఉంది. ఎలాంటి హీరోతో అయినా తనదైన స్టైల్ కామెడీ మిక్స్ చేసి సినిమాలు తీయడంలో ఈవీవీ దిట్ట. ఈవీవీ కెరీర్‌లో విజయవంతమైన సినిమాలు చాలా ఉన్నాయ్. కామెడీ సినిమాల్లో ఈవీవీ ఓ ట్రెండ్ సెట్టర్. ఈవీవీ తన ఇద్దరు కుమారులను సినిమాల్లోకి తీసుకువచ్చారు. ముందుగా పెద్ద కుమారుడు ఆర్యన్ రాజేష్ సురేష్ ప్రొడక్షన్ బ్యానర్లో వచ్చిన హాయ్ సినిమాతో హీరో అయ్యాడు. ఈ సినిమాకు ఈవీవీయే దర్శకుడు.
ఆ తర్వాత రెండో కుమారుడు నరేష్ రవిబాబు దర్శకత్వంలో వచ్చిన అల్లరి సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. అయితే హీరోగా నరేష్ సక్సెస్ అయినట్టు రాజేష్ సక్సెస్ కాలేదు. నరేష్ చాలా తక్కువ టైంలోనే 50కు పైగా సినిమాలు చేసేశాడు. ఇందులో హిట్లే ఎక్కువుగా ఉన్నాయి. రాజేష్ కెరీర్ స్టార్టింగ్‌లో కొన్ని సినిమాలు చేసినా తర్వాత సినిమాలకు దూరంగా ఉంటూ బిజినెస్‌పై కాన్‌సంట్రేషన్ చేస్తున్నాడు.
ఇక ఈవీవీ ఆరోగ్యం సరిగా లేనప్పుడు రాజేష్‌కు పెళ్లి చేసేయాలని ఆయన డిసైడ్ అయ్యారట. ఈ క్రమంలోనే ఈవీవీ స్నేహితుడి కుమార్తె సుభాషిణితో రాజేష్ పెళ్లి చేయాలని అనుకున్నారట. ముందుగా సుభాషిణి ఫొటోను రాజేష్‌కు చూపించి పెళ్లి చేసుకోవాలని చెపితే నో చెప్పారట. ఆ తర్వాత డైరెక్టుగా సుభాషిణిని చూసిన రాజేష్ ఆమెనే పెళ్లి చేసుకోవాలన్న నిర్ణయానికి వచ్చేశాడట.
ఇక 2011 జనవరి 5న మీరు పెళ్లి చూపులు జరిగాయి. ఈ చూపులు అయ్యాక వారం రోజులకే అంటే జనవరి 11న ఈవీవీ మృతి చెందారు. ఆ టైంలో అసలు వీరి పెళ్లి జరుగుతుందో ? లేదో ? అన్న సందిగ్ధం నెలకొంది. యేడాది పాటు వీరి పెళ్లి జరగలేదు. అయితే సుభాషిణి ఆర్యన్ రాజేష్‌కు ఎంతో సపోర్టింగ్‌గా నిలబడింది అట. ఈ విషయాన్ని ఆర్యన్ రాజేష్ స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
ఆ తర్వాత యేడాదికి 2012 ఫిబ్రవరి 12న ఆర్యన్ రాజేష్ పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు కుమారుడు పుట్టడంతో తన తండ్రి ఈవీవీయే మళ్లీ పుట్టారు అని ఈ కుటుంబం ఎంతో మురిసిపోయింది. ఆ తర్వాత రాజేష్ తాను బాధ్యత తీసుకుని తమ్ముడు నరేష్ పెళ్లి 2015లో మే 29న విజయవాడకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌తో చేశాడు.