ఆంధ్రుల ఆరాధ్య దైవం నటసార్వభౌముడు నందమూరి తారకరామారావు తనయుడిగా సినీ గడప తొక్కిన నటసింహం నందమూరి బాలకృష్ణ.. తనదైన టాలెంట్‌తో అంచలంచలుగా ఎదుగుతూ స్పెషల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు. వైవిధ్యభరితమైన పాత్రలు పోషించడమేకాక పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలలో కూడా నటించి కోట్లాది ప్రేక్షకులను తన అభిమానులుగా మార్చుకున్నారు.
హీరోగా ఎన్నో రికార్డులను సెట్ చేసిన బాలయ్య.. తన ఇన్నేళ్ల సినీ కెరీర్‌లో ఇతర ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉండడమో, లేక కథ మీద నమ్మకం లేకపోవడం వలనో కానీ సూపర్ హిట్ సినిమాలను కూడా రిజెక్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అలా బాలయ్య వదులుకున్న పది బ్లాక్ బస్టర్ సినిమాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1. చంటి: విక్టరీ వెంకటేశ్, మీనా జంటగా నటించిన `చంటి` 1991లో విడుదలై ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే మొదట ఈ సినిమా బాలయ్య వద్దకే వెళ్లగా.. ఆయనకు కథ నచ్చకపోవడంతో రిజెక్ట్ చేశారు.
2. జానకి రాముడు: కింగ్ నాగార్జున కెరీర్‌లో బ్లాక్ బస్టర్ హిట్టైన చిత్రాల్లో ఇది ఒకటి. ఆసక్తికర విషయం ఏంటంటే.. ఈ సినిమా బాలయ్య చేయాల్సి ఉంది. కానీ, పలు కారణాల వల్ల ఆయన ఈ ప్రాజెకట్ నుంచి తప్పుకున్నారు.
3. సింహరాశి: డైరెక్టర్ వి. సముద్ర సింహరాశి మూవీని బాలయ్యతో చేయాలనుకున్నా.. అది కుదరలేదు. ఆ తర్వాత రాజశేఖర్ ఈ చిత్రం చేసి హిట్ అందుకున్నాడు.
4. సూర్యవంశం: వెంకీటేశ్ సినిమాల్లో ప్రేక్షకులు ఇప్పటికీ మెచ్చే సినిమాల్లో సూర్యవంశం ఒకటి. మొదట ఈ కథ బాలయ్య దగ్గరకు వెళ్ళిందట. కానీ ‘పెద్దన్నయ్య’ కథని పోలి ఉందని ఆయన నో చెప్పాడట. కట్ చేస్తే వెంకీకి ఈ సినిమా సూపర్ డూపర్ హిట్‌ను అందించింది.
5. శివరామరాజు: 2002 లో వచ్చిన ఈ విజయవంతమైన ఈ చిత్రంలో నందమూరి హరికృష్ణ పాత్ర కోసం బాలయ్యను సంప్రదించగా.. ఆయన ఇతర ప్రాజెక్ట్స్ కారణంగా సున్నితంగా రిజెక్ట్ చేశారట.
6. అన్నవరం: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేసిన ఈ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ కూడా బాలయ్య వదులుకున్న చిత్రాల్లో ఒకటి.
7.బాడీగార్డ్: గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వెంకటేష్, త్రిష జంటగా చేసిన బాడీగార్డ్ 2012లో విడుదలై మంచి విజయం సాధించింది. ఇది ఈ రీమేక్ మూవీ కాగా.. దీనిని బాలయ్యతో చేయాలని ఓ నిర్మాత అనుకున్నారట. కానీ ఈ లోపే ఆ రీమేక్ హక్కులను నిర్మాత బెల్లంకొండ సురేష్ కొనుగోలు చేయడంతో.. బాలయ్య తప్పుకున్నారు.
8.సైరా నరసింహా రెడ్డి: మెగా చిరంజీవి నటించిన సూపర్ హిట్ చిత్రం సైరా నరసింహా రెడ్డి. నిజానికి పదేళ్ల క్రితమే బాలయ్య ఈ సినిమా చేయాల్సి ఉన్నా.. కుదరలేదు.
9. సింహాద్రి: దర్శకధీరుడు రాజమౌళి, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ సింహాద్రిని కూడా బాలయ్య వదులుకున్నారు.
10. క్రాక్: గోపీచంద్ మలినేని క్రాక్‌ను మొదట బాలయ్యతోనే చేయాలని భావించారు. కానీ, బాలయ్యకి ఈ కథ అంతగా నచ్చలేదట. కట్ చేస్తే రవితేజ ఈ మూవీ చేసి హిట్ అందుకున్నాడు.