చాలా మంది సెలబ్రిటీలు ఎరేంజ్‌డ్ మ్యారేజ్ కంటే లవ్ మ్యారేజ్‌లే చేసుకుంటున్నారు. ఒకప్పుడు కులాలు, మతాలు పట్టింపులు బాగా ఉండేవి. అయితే ఇప్పుడు ఇంటర్‌నెట్ యుగంలో ప్రపంచమే ఓ కుగ్రామంగా మారిపోయింది. అసలు ముఖాలు చూసుకోని వారు కూడా ప్రేమలో పడిపోతున్నారు. అసలు ఇక్కడ మతాలు, కులాలు, వయస్సులు, రంగులు, ప్రాంతాలు అన్నవి పట్టింపులోనే లేవు. ఈ క్రమంలోనే టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ తన తాజా ఇంటర్వ్యూలో తన ప్రేమకథ, పెళ్లి గురించి చెప్పాడు.
అసలు తాను పెళ్లి చేసుకుని చాలా అన్యాయం చేశానన్న షాకింగ్ కామెంట్లు కూడా చేశాడు. ఇక హరీష్ శంకర్ లవ్ మ్యారేజ్ చాలా చిత్రంగా జరిగింది. హరీష్… వాళ్ల భార్య బయట ఎక్కడో ఓ సారి పరిచయం అయ్యారట. జస్ట్ హాయ్ అంటే హాయ్ అనుకున్నారట. ఆ టైంలో ఆ అమ్మాయికి కేవలం 18-19 సంవత్సరాల ఏజ్ మాత్రమే ఉంటుందట. అప్పటకీ హరీష్ డైరెక్టర్ కాలేదు. రచయితగా కొనసాగుతూ బాగా స్ట్రగుల్ అవుతోన్న రోజులు అవి.
ఆ అమ్మాయి వాళ్ల తల్లిదండ్రులు కెనడాలో ఉంటారు.. వాళ్లది వెల్ సెటిల్ ఫ్యామిలీ. అయితే తర్వాత అదే అమ్మాయి, హరీష్ సోషల్ మీడియాలో పరిచయం అయ్యారట. ఆమె కావాలని హరీష్ వెంటపడుతూనే ఉంటూ ప్రేమిస్తోందట. తర్వాత ఓ రోజు హరీష్ నువ్వు బయట పరిచయం అయ్యావ్ కదా ? అని అడగడంతో ఆమె ఎస్ అని చెప్పిందట. చివరకు ఆమె తనను వెంటపడి ప్రేమించిందని.. తాను ఆమెను ప్రేమించకపోయినా మ్యారేజ్ చేసుకున్నానని వెరైటీ ఆన్సర్ ఇచ్చాడు.
తన పట్ల ఆమె ప్రేమ, కమిట్‌మెంట్ తనకు చాలా నచ్చిందని..మనం మన భాగస్వామికి సరైన టైం ఇవ్వనప్పుడు పెళ్లి చేసుకుని వారిని అన్యాయానికి గురి చేయడం కరెక్ట్ కాదనే తాను పెళ్లి వద్దు అంటున్నానని హరీష్ చెప్పాడు. ఇక ప్రతి విషయంలోనూ తన భార్య ఆల్‌రైట్ ఫర్‌ఫెక్ట్ అని.. తన వైపునుంచే అంతా తప్పు జరుగుతుందని చెప్పాడు. తన భార్య క్లినికల్ సైకాజలీ. ఆటిజం ఉన్న కిడ్స్ కు సంబంధించిన సబ్జెక్ట్ ఇది అని చెప్పాడు.ఇక తనకు సినిమా నాలెడ్జ్ జీరో అని.. నాకు ఇంటికి వెళ్లాక అస్సలు సినిమా గోల ఉండదని చెప్పాడు.
అయితే ఆమె మాత్రం ఇంట్లో టామ్ అండ్ జెర్రీ, స్పైడర్ మ్యాన్ సినిమాలు చూస్తూ ఫ్రెండ్సే లోకంగా గడిపేస్తూ ఉంటుందని చెప్పాడు. ఇక డైరెక్టర్ కాకముందు నుంచే నన్ను ఇష్టపడిందని.. ఆడ అయినా, మగ అయినా భర్త / భార్యకు 100 న్యాయం చేసేటైం లేనప్పుడు పెళ్లి అన్నది వేస్టే తన సిద్ధాంతం అని చెప్పాడు. సినిమా వాళ్లు ఉదయం 4 గంటలకు బయటకు వెళితే రాత్రి ఎప్పుడో వస్తారని.. ఇక అవుట్ డోర్ షూటింగ్స్ అవి ఉంటాయని.. అవి బ్యాలెన్స్ చేస్తూ ఫ్యామిలీకి సమయం కేటాయించడం కష్టమవుతుందని కూడా చెప్పాడు.