ఒకే టైటిల్ కలిసి వచ్చేలా సినిమాలు రావడం అనేది ఇండస్ట్రీలో కామన్‌గా జరుగుతూ ఉంటుంది. ఉదాహరణకు విక్టరీ వెంకటేష్ హీరోగానే రాజా అన్న టైటిల్ కలిసి వచ్చేలా ఒకటి, రెండు కాదు నాలుగు సినిమాలు వచ్చాయి. పోకిరి రాజా – రాజా – బొబ్బిలి రాజా ఇలా… ఇక పోలీస్ టైటిల్ కలిసొచ్చేలా దాదాపు అందరు స్టార్ హీరోలు సినిమాలు చేశారు. అలాగే శివ, శివయ్య, శివన్న ఇలా ఒకే టైటిల్‌ను పోలి ఉండే సినిమాలు మన తెలుగులో చాలా యేళ్ల నుంచి వస్తూనే ఉన్నాయి.
అయితే ఈ సినిమాల్లో కొన్ని మాత్రమే ప్రేక్షకుల ఆదరణకు నోచుకుంటే.. మరి కొన్ని నిరుత్సాహ పరుస్తున్నాయి. సర్దార్ అంటేనే ఓ పవర్ ఫుల్ పదం.. ఈ పదాన్ని వాడుకుని ఇండస్ట్రీలో చాలా సినిమాలు వచ్చాయి. సర్దార్ పేరుతో ఇండస్ట్రీలో వచ్చిన సినిమాల లిస్ట్.. వాటి ఫలితాలు చూద్దాం. ఎన్టీరామారావు హీరోగా దాసరినారాయణ రావు దర్శకత్వంలో 1980 సంవత్సరంలో సర్దార్ పాపారాయుడు సినిమా వచ్చింది.
శ్రీదేవి హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేశారు. ఈ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ అవ్వడంతో పాటు భారీ వసూళ్లు రాబట్టింది. ఇక సూపర్ స్టార్ కృష్ణ హీరోగా ఏ కోదండిరామిరెడ్డి దర్శకత్వంలో 1987లో సర్దార్ కృష్ణమనాయుడు సినిమా వచ్చింది. ఊర్వశి, శారద ముఖ్యపాత్రల్లో నటించిన ఈ సినిమాలో విజయశాంతి హీరోయిన్. భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది.
ఇక రెబల్ కృష్ణంరాజు కూడా సర్దార్ టైటిల్‌తో వచ్చిన ఓ సినిమాలో నటించారు. భాస్కరరావు దర్శకత్వంలో వచ్చిన సర్దార్ ధర్మన్న సినిమాలో రాధిక, జయసుధ హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా కూడా భారీ అంచనాలతో తెరకెక్కి డిజాస్టర్ అయ్యింది. ఇక ఇటీవల కాలంలో పవర్ స్టార్ పవన్ కళ్యాన్ కూడా సర్దార్ టైటిల్‌తో వచ్చిన సినిమాలో నటించారు.
2016లో తాను నటించిన గబ్బర్‌సింగ్ టైటిల్‌ను అనుకరిస్తూ సర్దార్ గబ్బర్‌సింగ్ సినిమా చేశారు. కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు బాబి దర్శకత్వం వహించారు. గబ్బర్‌సింగ్ రేంజ్‌లో ఈ సినిమాను ప్రేక్షకులు, పవన్ అభిమానులు ఊహించుకున్నారు. అయితే ఆ అంచనాలను సర్దార్ గబ్బర్‌సింగ్ అందుకోలేకపోయింది. ఓవరాల్‌గా సర్దార్ టైటిల్‌తో నాలుగు సినిమాలు వస్తే అందులో ఎన్టీఆర్ సినిమా మినహా ఏ ఒక్కటి హిట్ కాలేదు.