బాలీవుడ్ హాట్ బ్యూటీ.. ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ గత కొన్నేళ్లుగా ఎప్పుడూ ఏదో ఒక సంచలనాత్మక వార్తలతో ముందుంటోంది. సినిమాల పరంగా బాలీవుడ్ స్టార్ హీరోలను టార్గెట్ చేస్తూ వచ్చిన ఆమె… కాస్టింగ్ కౌచ్‌తో పాటు బాలీవుడ్ నెపోటిజంపై బాగా గళమెత్తింది. ఆ తర్వాత మహారాష్ట్రలో అధికారంలో ఉన్న శివసేన ప్రభుత్వంతోనూ పెట్టుకుని తాను ఎక్కడా వెనక్కు తగ్గేదేలే అని ఫ్రూవ్ చేసుకుంది. అసలు కంగనతో పెట్టుకునేందుకు చాలా మంది సైతం భయపడుతున్నారు.
తాజాగా ఆమె హీరోయిన్గా చేసిన ధాకడ్ సినిమా ఈ నెల 20న రిలీజ్ అవుతోంది. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో కంగన గత రెండు, మూడు వారాలుగా చాలా యాక్టివ్‌గా ఉంటోంది. దేశవ్యాప్తంగా పర్యటిస్తూ ప్రమోషన్లలో పాల్గొంటూ వస్తోంది. గత కొంత కాలంగా కంగన చేస్తోన్న సినిమాలు చూస్తే అవన్నీ లేడీ ఓరియంటెడ్ సినిమాలే… తాజాగా ఆమె చేస్తోన్న ధాకడ్ సినిమా సైతం లేడీ ఓరియంటెడ్ సినిమాయే కావడం విశేషం.
ఈ క్రమంలోనే ఆమె కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసింది. బాలీవుడ్లో తనను కొందరు తొక్కేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పింది. ఇదే మాట ఆమె గతంలో కూడా చాలాసార్లు చెప్పింది. అయితే ఈ సారి కంగన తన పెళ్లి గురించి కూడా కామెంట్లు చేసింది. ఈ సినిమాలో మీ పాత్ర మగరాయుడి మాదిరిగా ఉంటుందా ? అని ప్రశ్నించగా… మీరు ఇలాంటి పుకార్లు పుట్టించడం వల్లే తనకు ఇప్పటకీ పెళ్లి కావడం లేదంటూ వాపోయింది.
తాను కావాలనే అందరితోనూ గొడవ పెట్టుకుంటాను అనే అభిప్రాయం ఉందని.. అందువల్లే తన పేరును ఫైర్‌బ్రాండ్ అని మార్చేశారు. అయితే నేను ఇప్పటి వరకు ఎవరిని అయినా కొట్టానా ? అన్నది చెప్పాలని ఆమె తిరిగి ప్రశ్నించారు. తాను ఎప్పుడూ కూడా ఓ మంచి అమ్మాయిగా ఉండాలని ప్రయత్నిస్తుంటే కావాలనే కొందరు తనను టార్గెట్ చేస్తున్నారు అని కంగన చెప్పింది.