మూడేళ్ల క్రితం సంక్రాంతి కానుకగా వచ్చిన ఎఫ్ 2 సినిమా రెండు పెద్ద సినిమాల పోటీని తట్టుకుని మరీ బ్లాక్‌బస్టర్ అయ్యింది. బాలయ్య నటించిన ఎన్టీఆర్ కథానాయకుడు, రామ్‌చరణ్ – బోయపాటి వినయవిధేయ రామ సినిమాలను తట్టుకుని మరీ సూపర్ హిట్ అయ్యింది. ఇప్పుడు మూడేళ్ల తర్వాత సేమ్ అదే టీంతో ఎఫ్ 2కు సీక్వెల్‌గా ఎఫ్ 3 చేశారు. అదే దిల్ రాజు బ్యానర్.. డైరెక్టర్ సేమ్ అనిల్ రావిపూడి.. వెంకీ, వరుణ్‌కు జోడీగా తమన్నా, మెహ్రీన్.. కొత్తగా మరో హీరోయిన్ సోనాల్ చౌహాన్, సునీల్ లాంటి వాళ్లు యాడ్ అయ్యారు.
ఎఫ్ 2 సినిమా వరల్డ్ వైడ్‌గా రు. 130 కోట్ల గ్రాస్‌తో పాటు రు. 80 కోట్ల షేర్ కొల్లగొట్టి నిర్మాత దిల్ రాజుకు లాభాల పంట పండించింది. ఇక ఎఫ్ 3 రిలీజ్ డేట్ దగ్గర పడుతోన్న కొద్ది ప్రమోషన్లు పీక్ స్టేజ్‌కు చేరిపోయాయి. మేకర్స్‌తో పాటు చిత్ర యూనిట్ విపరీతంగా కష్టపడుతున్నారు. ఓవర్సీస్‌లో 350 లొకేషన్లలో ప్రీమియర్లు వేస్తున్నారు.
ఇదిలా ఉంటే ఈ సినిమాకు వరల్డ్ వైడ్‌గా రు. 63.60 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది. అంటే రు. 64 కోట్లు వస్తే కాని బ్రేక్ ఈవెన్ కాదు. నిర్మాత దిల్ రాజు నైజాం, వైజాగ్, కృష్ణా, గుంటూరులో ఓవన్ రిలీజ్ చేసుకుంటున్నారు. ఏరియాల వారీగా ప్రి రిలీజ్ బిజినెస్ వివరాలు ఇలా ఉన్నాయి.
నైజాం – 18 కోట్లు
సీడెడ్ – 8.40 కోట్లు
ఉత్తరాంధ్ర – 7 కోట్లు
ఈస్ట్ – 4.50 కోట్లు
వెస్ట్ – 4 కోట్లు
గుంటూరు – 5 కోట్లు
కృష్ణా – 4.50 కోట్లు
నెల్లూరు – 2.40 కోట్లు
————————————
ఏపీ + తెలంగాణ = 53.80 కోట్లు
—————————————
కర్నాటక – 3.40 కోట్లు
రెస్టాఫ్ ఇండియా – 1.20 కోట్లు
ఓవర్సీస్ – 5.20 కోట్లు
—————————————–
వరల్డ్ వైడ్ బిజినెస్ – 63.60 కోట్లు
—————————————–
మరి వాస్తవంగా చెప్పాలంటే వెంకీ – వరుణ్‌కు ఎఫ్ 2 వసూళ్లతో పోలిస్తే ఇది తక్కువ టార్గెట్‌గా ఉన్నా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించాలంటే సినిమాకు అదిరిపోయే టాక్ రావాలి. మరి వెంకీ – వరుణ్ ఏం చేస్తారో ? అనిల్ ఎలాంటి మాయ చేశాడో ? చూడాలి.