ఎఫ్ 2 లాంటి బ్లాక్‌బస్టర్‌కు సీక్వెల్‌గా మూడేళ్ల గ్యాప్ తర్వాత ఎఫ్ 3 సినిమా వచ్చింది. రిలీజ్‌కు ముందే భారీ అంచనాలు.. టీజర్లు, ట్రైలర్లు పేలిపోవడంతో పాటు ఎఫ్ 2 లాంటి కామెడీ హిట్ టీంతో వస్తోన్న సినిమా కావడంతో భారీ అంచనాలే ఉన్నాయి. ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రీమియర్లు పూర్తి చేసుకుంది. మరి ఈ సినిమాకు ఎలాంటి టాక్ వచ్చిందో చూద్దాం.
ఈ సినిమా కథ పరంగా చూస్తే ఆనంద్ ప్రసాద్ (మురళీ శర్మ) ఓ బిజినెస్‌మేన్. తప్పిపోయిన తన వారసుడి కోసం వెతుకుతూ ఉంటాడు. వెంకీతో పాటు పగటి కలలు కనే వరుణ్‌తేజ్ ఇద్దరూ కూడా ధనిక అమ్మాయిలను పడగొట్టడం ద్వారా ధనవంతులు కావాలని ట్రై చేస్తూ ఉంటారు. వీరికి తమన్నాకు, మెహ్రీన్‌కు మధ్య ఏం జరుగుతుంది ? మధ్యలో సోనాల్ చౌహాన్ పాత్ర ఏంటి ? సినిమా అంతా కామెడీతో గోల గోలగా ఎలా ? సాగింది ? అన్నదే కథ.
సినిమా ఫ్లస్‌ల విషయానికి వస్తే వెంకీ – వరుణ్‌తేజ్ కామెడీ సీన్స్, మెహ్రీన్, సోనాల్, తమన్నా అందచందాలు… ఇక మైనస్‌ల విషయానికి వస్తే పాటలతో పాటు కథ రీజన్‌బుల్‌గా లేకపోవడం.. చాలా చోట్ల లాజిక్‌లకు అందదు. సినిమా ఫస్టాఫ్ అంతా కామెడీ సీన్లతో నవ్విస్తుంది. వెంకీ, వరుణ్ అదరగొట్టేస్తారు.
ఓవరాల్‌గా చూస్తే ఎఫ్ 3 కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైన్‌మెంట్. సరదా సన్నివేశాలు… కాస్త ఎమోషన్లు కలగలిపి దర్శకుడు అనిల్ రావిపూడి ఈ సినిమా తెరకెక్కించాడు. సినిమాలో కావాల్సినంత ఫన్ దొరుకుతుంది. సినిమాలో ఎలాంటి లాజిక్‌లు ఆశించవద్దు, మీరు ఇటీవలి కాలంలో తెలుగులో వచ్చిన భారీ యాక్షన్ సినిమాలకు భిన్నంగా ఫ్యామిలీతో సహా ఎంజాయ్ చేసే సినిమాయే ఎఫ్ 3.