Moviesఆ భ‌యంతో బ‌న్నీ స్నేహారెడ్డిని ల‌వ్ చేసిన‌ట్టు ఫ‌స్ట్ ఎవ‌రికి చెప్పాడంటే...!

ఆ భ‌యంతో బ‌న్నీ స్నేహారెడ్డిని ల‌వ్ చేసిన‌ట్టు ఫ‌స్ట్ ఎవ‌రికి చెప్పాడంటే…!

ఒక‌ప్పుడు మామూలు హీరో… ఆ త‌ర్వాత టాలీవుడ్‌కే స్టైల్ నేర్పి స్టైలీష్ స్టార్ అయ్యాడు. ఇప్పుడు ఏకంగా ఐకాన్ స్టార్ అయిపోయాడు. ప్ర‌తి సినిమాకు ఒక్కో మెట్టు ఎక్కుతూ టాలీవుడ్ నెంబ‌ర్ వ‌న్ హీరో రేంజ్‌కు దూసుకు పోతున్నాడు. పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు. పుష్ప ఎలాంటి ప్ర‌మోష‌న్లు లేకండానే బాలీవుడ్‌లో ఏకంగా రు. 100 కోట్ల వ‌సూళ్లు సాధించ‌డంతో తెలుగు వాళ్లే కాదు.. బాలీవుడ్ ట్రేడ్ వ‌ర్గాల‌కు సైతం దిమ్మ‌తిరిగిపోయింది.

బ‌న్నీకి ఇప్పుడు పాన్ ఇండియా ఇమేజ్ కూడా వ‌చ్చేసింది. పుష్ప 2ను కూడా పాన్ ఇండియా లెవ‌ల్లోకి తీసుకు వెళ్లేలా రు. 400 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో సినిమాను నిర్మిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో అల్లు అర్జున్ మామ చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి ఓ ఇంట‌ర్వ్యూలో త‌న అల్లుడిని ఆకాశానికి ఎత్తేస్తూ చేసిన వ్యాఖ్య‌లు ప్రాధాన్య‌గా మారాయి. ఇబ్ర‌హీంప‌ట్నం టీఆర్ఎస్ నాయ‌కుడు చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి కుమార్తె స్నేహారెడ్డిని బ‌న్నీ ప్రేమ వివాహం చేసుకున్న సంగ‌తి తెలిసిందే.

2011లో బ‌న్నీ – స్నేహా పెళ్లి జ‌రిగింది. బ‌న్నీ త‌న బిజీ షెడ్యూల్స్ ఉన్నా కూడా ప్ర‌తి ఫంక్ష‌న్‌కు అత్త‌వారింటికి వెళుతుంటాడు. ఇక చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి మాట్లాడుతూ త‌న అల్లుడు పాన్ ఇండియా స్టార్‌గా ఎద‌గ‌డంపై సంతోషం వ్య‌క్తం చేశారు. మ‌న రాష్ట్రంలోనే కాకుండా.. బ‌య‌ట కూడా బ‌న్నీకి ఎంతోమంది అభిమానులు ఉన్నార‌ని కితాబు ఇచ్చాడు.

ఇక పెళ్లికి బ‌న్నీ ఎంత క‌ట్నం తీసుకున్నాడు ? అన్న ప్ర‌శ్న‌కు చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి బ‌దులు ఇస్తూ త‌న అల్లుడు అస్స‌లు క‌ట్నం తీసుకోలేద‌ని ఆ సీక్రెట్ బ‌య‌ట పెట్టాడు. వాళ్ల‌కే చాలా ఉంది.. మ‌నం ఇచ్చేది వాళ్ల లెక్క‌ల్లోకి కూడా రాదు. అంతే కాకుండా వాళ్లు క‌ట్న కానుక‌ల‌కు వ్య‌తిరేకం అంటూ బ‌న్నీని ప్ర‌శంసించాడు. చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి అల్లుడు బ‌న్నీ గురించి చాలా గొప్ప‌గా చెప్పుకున్నా బ‌న్నీ – స్నేహారెడ్డిని ప్రేమించిన విష‌యాన్ని ఇంట్లో చెప్పేందుకు ముందు చాలా భ‌య‌ప‌డ్డాడ‌ట‌.

ఈ విష‌యాన్ని బ‌న్నీయే స్వయంగా చెప్పాడు. ముందు బ‌న్నీకి త‌న ప్రేమ‌ను తండ్రి అర‌వింద్‌కు చెప్పే ధైర్యం చేయ‌లేక త‌న తల్లి నిర్మ‌ల‌మ్మ‌కు చెప్పాడ‌ట‌. అమ్మ ముందు నుంచి త‌న‌కే స‌పోర్ట్ చేసేదని.. పైగా ఇక్క‌డ ఇంట‌ర్ క్యాస్ట్ మ్యారేజ్ కావ‌డంతో అమ్మ కూడా ఏం అనుకుంటుందో అని భ‌యం భ‌యంగా చెప్ప‌గా.. అమ్మ మాత్రం మ‌రో మాట చెప్ప‌కుండా నీ ఇష్టం అని త‌న‌కు స‌పోర్ట్ చేసింద‌ని.. ఆ త‌ర్వాత అమ్మే నాన్న‌కు చెప్పి అంతా స‌వ్యంగా జ‌రిగేలా చూసుకుంద‌ని బ‌న్నీ చెప్పాడు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news