టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తనకంటూ ఓ ప్రత్యేక స్థానంతో టాప్ హీరోల్లో ఒకడిగా ఉన్నాడు. 1999లో కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన రాజకుమారుడు సినిమాతో హీరోగా కెరీర్ స్టార్ట్ చేసిన మహేష్ వచ్చే వారం సర్కారు వారి పాట సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ మధ్య కాలంలో ఎన్నో హిట్ సినిమాలు, వైవిధ్యమైన సినిమాలతో తిరుగులేని ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడు.
ఇక పీఫుల్స్ స్టార్ ఆర్. నారాయణ మూర్తి విప్లవాత్మక సినిమాలతో ఆకట్టుకుంటూ తన రూటే సపరేట్‌గా ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు. ఆర్. నారాయణమూర్తి ని ఏ హీరో అభిమాని అయినా ఇష్టపడతారు. ఇప్పటకీ కారు కూడా లేకుండా ఎంతో సింపుల్ జీవితాన్ని ఆయన కొనసాగిస్తున్నారు. కమర్షియల్ సినిమాల్లో ఎంత రెమ్యునరేషన్ ఇస్తామన్నా నారాయణ మూర్తి ఆ పాత్రలు వేసేందుకు ఎప్పుడూ ఒప్పుకోరు.
ఇక భిన్న ధృవాల ఇమేజ్‌తో ఉండే నారాయణమూర్తి, మహేష్‌బాబు కలిసి ఓ సినిమాలో నటించారు. ఈ విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. అది కూడా దర్శకరత్న దాసరి నారాయణరావు దర్శకత్వంలో కావడం ఓ విశేషం. మహేష్‌బాబు చిన్న వయస్సులో ఉన్నప్పుడు దాసరి నారాయణరావు దర్శకత్వంలో నీడ సినిమాలో నటించారు. మహేష్ తొలిసారి మేకప్ వేసుకుంది ఈ సినిమాతోనే..!
ఇక దాసరి శిష్యుడిగా నటుడిగా రంగప్రవేశం చేసిన నారాయణమూర్తి ఆ తర్వాత నిర్మాతగా, దర్శకుడిగా, నటుడిగా ఇలా ఎన్నో సినిమాలు చేశారు. ఇక నారాయణమూర్తి కూడా ఇదే నీడ సినిమాతో తొలిసారిగా క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించారు. అలా నాలుగు దశాబ్దాల క్రితమే వీరిద్దరు కలిసి ఓ సినిమాలో నటించారు అన్న విషయం తక్కువ మందికే తెలుసు.
ఇక దాసరి తన సినిమాలతో తెలుగు సినిమా పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన పేజీ ఏర్పాటు చేసుకున్నారు. ఆయన ఎంతో మంది నటీనటులను, దర్శకులు, టెక్నికల్ డిపార్ట్‌మెంట్ వాళ్లను వెండితరకు పరిచయం చేశారు. 151 సినిమాలకు దర్శకత్వం వహించడం అంటే ఆయన ఎంతో మందికి ఉపాధి కల్పించిన మహనీయుడు అయ్యారు.