సూపర్‌స్టార్ మహేష్‌బాబు కెరీర్‌లో ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టిన సినిమా మురారి. నందిగం రామలింగేశ్వరరావు నిర్మించిన ఈ సినిమాకు కృష్ణవంశీ దర్శకత్వం వహించారు. 2001లో వచ్చిన ఈ సినిమా యూత్‌ను, అటు ఫ్యామిలీ ఆడియెన్స్‌ను ఆకట్టుకుంది. ఈ సినిమాలో మహేష్‌కు జోడీగా సోనాలి బింద్రే హీరోయిన్గా నటించింది. అలాగే కైకాల, లక్ష్మి కీలకమైన పాత్రల్లో మెప్పించారు.
ఈ సినిమా నిర్మాత నందిగం రామలింగేశ్వరరావు కృష్ణకు ఎంతో అనుబంధం ఉండేది. వీరిద్దరి కాంబినేషన్లో ఎన్నో సినిమాలు వచ్చాయి. ఆ రిలేషన్‌తోనే కృష్ణ కొడుకు మహేష్‌బాబుతో కూడా ఓ సినిమా తన బ్యానర్లో తీయాలని.. ఖచ్చితంగా అది హిట్ అవ్వాలని నిర్మాత రామలింగేశ్వరరావు భావించారు. కథ, కథనాల పరంగా ఈ సినిమా యూత్‌కు, ఫ్యామిలీస్ కు బాగా నచ్చింది.
కెరీర్ పరంగా మహేష్‌కు ఇది నాలుగో సినిమా. మహేష్ గత మూడు సినిమాలతో పోలిస్తే చాలా ఎక్కువ బడ్జెట్ ఈ సినిమాకు పెట్టారు. ఈ సినిమాకు అప్పట్లోనే రు. 8 కోట్లు బడ్జెట్ అయ్యింది. అప్పట్లో ఓ సినిమా హిట్ అవ్వాలంటే కనీసం 15 – 20 రోజులు హౌస్‌ఫుల్స్‌తో థియేటర్లలో నడవాలి. తొలి వారంలో మురారి సినిమాకు ఆశించిన స్థాయిలో వసూళ్లు రాలేదు.
సినిమా కష్టం అనుకున్నారు. అయితే రెండో వారం నుంచి సినిమా ఫికప్ అయ్యింది. కట్ చేస్తే 50 – 100 – 175 – 200 రోజులు ఆడి బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టింది. మౌత్ పబ్లిసిటీతో వసూళ్లు బాగా పుంజుకున్నాయి. ఈ సినిమాలో ముందుగా హీరోయిన్గా వసుంధర దాస్ ( హేరామ్) తీసుకుందామని కృష్ణవంశీ పట్టుబట్టారు. అయితే నిర్మాతలు మాత్రం సోనాలి వైపు మొగ్గు చూపారు. అయితే సోనాలి ఈ సినిమాకు చాలా ప్లస్ అయ్యిందని సినిమా రిలీజ్ అయ్యాక తెలిసింది. వీరిద్దరి కాంబినేషన్‌ను ఇప్పటకీ చూస్తుంటే సూపర్బ్ అనేలా ఉంటుంది.
ఇక ఈ సినిమా కెమేరామెన్‌గా భూపతిని తీసుకుందామని కృష్ణవంశీ అంటే నిర్మాతలు మాత్రం సీ రాం ప్రసాద్ వైపు మొగ్గు చూపారు. ఇలా చివరి వరకు ఈ మనస్పర్థలు ఉండడంతోనే అసలు ఈ సినిమా సూపర్ హిట్ అయినా 100 రోజుల ఫంక్షన్ కూడా చేయలేదని అంటారు. ఇక వసుంధర దాస్‌నే మహేష్ పక్కన హీరోయిన్‌గా తీసుకోవాలని కృష్ణవంశీ ఎంత పట్టుబట్టినా కూడా నిర్మాతలు సోనాలి వైపు మొగ్గు చూపడంతో మహేష్ బ్లాక్‌బస్టర్ సినిమాలో నటించే ఛాన్స్ వసుంధర కోల్పోయింది.