విధి ఎంతో వైచిత్రం.. ఒకప్పుడు తినడానికి తిండి లేక… పడుకోవడానికి ఇళ్లు కూడా దిక్కులేక.. కార్లలోనే పడుకున్న ఆమె క్రేజీ హీరోయిన్ అయిపోయి ఇండస్ట్రీతో పాటు అభిమానులను ఓ ఊపు ఊపేసింది. తర్వాత ఓ స్టార్ హీరోకు భార్య అయ్యింది… మరో ఇద్దరు స్టార్ హీరోయిన్లకు తల్లి అయ్యింది. ఇప్పుడు అందరూ ఉన్నా కూడా ఎవ్వరూ లేని ఏకాకిగా మిగిలిపోయింది. జీవిత చివరి దశలో తన కెరీర్ ఎక్కడ స్టార్ట్ అయ్యిందో తిరిగి అక్కడికే వెళ్లిపోయేంతలా ఇబ్బంది పడుతోంది. ఈ స్టోరీ అంతా ఎవరి గురించో చెపుతోంది కాదు కమల్‌హాసన్ రెండో భార్య, ఇప్పుడు స్టార్ హీరోయిన్ శృతీహాసన్ తల్లి సారిక గురించే..!
ఢిల్లీలో రాజ్‌పుట్‌ల కుటుంబంలో పుట్టిన సారిక నాలుగేళ్ల వయస్సు ఉన్నప్పుడే తండ్రి ఆమెతో పాటు తల్లిని వదిలేశాడు. బాలనటిగా మారిన ఆమెకు ఫుల్ డిమాండ్ వచ్చేసింది. చివరకు ఆ తల్లి ఆమెను చదువు కోనీయలేదు. ఆమె సంపాదనతోనే ఏకంగా ఐదు అపార్ట్‌మెంట్లు కూడా కొంది. సరిగా అన్నం పెట్టేదే కాదు.. ఇంట్లోకి కూడా రానివ్వకపోవడంతో చివరకు కారులోనే బయట పడుకునేది అట. ఆ తల్లి మృతి చెందాకే కాస్త సారికకు రిలీఫ్ వచ్చిందంటారు.
అయితే అప్పటికే ఆమె సంపాదనతో కొన్న ఆస్తులు అన్నీ ఆమె పేరు మీద లేవు. ఆ సమయంలో ఆమీర్ ఖాన్ కజిన్ నుజిత్ మంచి ఫ్రెండ్ కావడంతో ఆమె సాయం కోరింది. ఆ ఆస్తుల లీగల్ ఇష్యూలు అన్నీ ఆమీర్ చూశాడు. అలా ప్రేమరాహిత్యంతో బతుకుతున్న ఆమెకు కొన్ని సినిమాలు హిట్ అవ్వడంతో పాటు అందం ఉండడంతో క్రేజ్ వచ్చింది. అప్పుడు భారత మాజీ క్రికెటర్ కపిల్‌దేవ్‌తో ప్రేమలో పడింది. కపిల్ కూడా సారికను ప్రేమించడం మొదలు పెట్టాడు. ఇద్దరూ కలిసి ఎంజాయ్ చేశారు. కపిల్ కోసమే సారిక చాలా సార్లు ఛండీఘర్ వెళ్లేది.
ఆ తర్వాత చాలా రోజులకు కపిల్‌కు రోమి అనే గర్ల్ ఫ్రెండ్ ఉందని.. వాళ్లిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారని తెలిసింది. సారిక చాలా కుంగిపోయింది. కపిల్ ఇంత దెబ్బేస్తాడని ఆమె అస్సలు ఊహించనే లేదు. ఆ తర్వాత బాల నటుడిగా ఉన్నప్పటి నుంచే పరిచయం ఉన్న సచిన్ పిల్గావ్కర్‌తో ప్రేమను పంచుకుంది. అతడు దూరమయ్యాడు. తర్వాత మోడల్ దీపిక్ పరాశర్‌తో ప్రేమ అది కూడా ఫెయిల్ అయ్యింది.
ఆ టైంలో తమిళం నుంచి బాలీవుడ్ వెళ్లి సాగర్ సినిమాతో సక్సెస్ అయిన కమల్‌హాసన్‌తో ప్రేమ పంచుకుంది. కమల్‌కు అప్పటికే వాణి గణపతితో పెళ్లయ్యింది. అయితే బాలీవుడ్‌లో తిష్ట వేయాలంటే అక్కడ స్టార్ హీరోయిన్‌గా ఉన్న సారిక అండదండలు కావాలనుకున్నాడు. ఆమెతో సహజీవనం చేశాడు. ఫలితంగా శృతి పుట్టింది. 28 ఏళ్ల వయస్సులో మాంచి కెరీర్ వదులుకుని.. ముంబైను కాదనుకుని సారిక చెన్నై వచ్చేసింది. తర్వాత ఈ దంపతులకు అక్షర కూడా పుట్టింది.
వాణికి విడాకులు ఇచ్చి 1988లో సారికను కమల్ పెళ్లి చేసుకున్నాడు. 43 ఏళ్లు వచ్చేసరికి కమల్ ఆమెను వదిలేశాడు. చివరకు పిల్లలను కూడా తల్లి దగ్గరకు కమల్ వెళ్లకుండా కట్టడి చేశాడని అంటారు. చివరకు సారిక ఆత్మహత్యాయత్నం చేసింది. చెన్నై వదిలేసి ముంబై వెళ్లిపోయింది. ఇప్పుడిప్పుడే శృతి, అక్షర గుర్తుకు వచ్చినప్పుడు తల్లి వెద్దకు వెళుతుంటారట. అయితే ఆస్తులు అన్నీ కరిగిపోవడంతో ఇప్పుడు సారిక వెబ్‌సీరిస్‌లు.. చిన్నా చితకా క్యారెక్టర్లు వేసుకుంటూ జీవిస్తోందన్న వార్త మాత్రం ప్రతి ఒక్కరిని బాధపెట్టేదే..!