తెలుగు సినిమా పరిశ్రమలో విలక్షణమైన నటుడు ఎవరైనా ఉన్నారు అంటే అది రియల్ స్టార్ శ్రీహరి. శ్రీహరి చనిపోయి ఇన్నేళ్లు అవుతున్నా కూడా ఇప్పటకీ శ్రీహరి తన సినిమాలతో ప్రేక్షకుల మదిలో అలా నిలిచిపోయే ఉన్నాడు. శ్రీహరి ముందు విలన్‌గా కెరీర్ స్టార్ట్ చేశాడు. తర్వాత తన విలక్షణ నటనతో ప్రేక్షకులను మెప్పించాడు.
విలన్.. ఆ తర్వాత క్యారెక్టర్ నటుడిగా ఎదిగిన శ్రీహరి ఆ తర్వాత కేఎస్. నాగేశ్వరరావు దర్శకత్వంలో వరుసగా యాక్షన్ సినిమాలు చేస్తూ రియల్ స్టార్‌గా మారిపోయాడు. అప్పట్లో శ్రీహరి సినిమాలు అంటే మాస్‌లో పిచ్చ క్రేజ్ ఉండేది. ఆ తర్వాత మగధీర లాంటి సినిమాల్లో శ్రీహరి చేసిన షేర్ ఖాన్ లాంటి క్యారెక్టర్ ఎంత పాపులర్ అయ్యిందో.. అది శ్రీహరి జీవితంలో ఎలా మిగిలిపోయిందో తెలిసిందే.
శ్రీహరి కెరీర్ స్టార్టింగ్‌లోనే ఐటెం గర్ల్‌గా పాపులర్ అయిన డిస్కోశాంతిని ప్రేమించి పెళ్లాడాడు. ఈ దంపతులకు ఇద్దరు మగపిల్లలు. అయితే అనారోగ్యంతో చిన్న వయస్సులోనే శ్రీహరి అకాల మరణం ఇండస్ట్రీని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. చాలా రోజుల పాటు శ్రీహరి మృతిని ఎవ్వరూ జీర్ణించుకోలేకపోయారు. ఇక శ్రీహరి ఫ్యామిలీకి దర్శకుడు నిమ్మల శంకర్ ( ఎన్. శంకర్)కు ఎంతో అనుబంధం ఉండేది.
శ్రీహరి – శంకర్ కాంబినేషన్లో భద్రాచలం సినిమా వచ్చింది. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో పాటు శ్రీహరికి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈ సినిమా కోసం శ్రీహరి చాలా కష్టపడ్డాడు. ఈ క్రమంలోనే ఓ సీన్‌లో శ్రీహరిని పూర్తిగా తలకిందులుగా వేలాడదీసి షూట్ చేస్తున్నారట. అయితే అప్పుడు శ్రీహరి భార్య డిస్కోశాంతికి విపరీతంగా కోపం వచ్చేసి నా భర్తను చంపేస్తారా ? అని శాపనార్థాలు పెట్టేదట.
ఈ విషయాన్ని తాజా ఇంటర్వ్యూలో ఎన్. శంకర్ స్వయంగా చెప్పారు. శ్రీహరి మోహన్‌బాబు గారి డైలాగులు అద్భుతంగా చెప్పేవాడని కూడా శంకర్ చెప్పాడు. చిన్న వయస్సులోనే మాస్ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీహరి చిన్న వయస్సులోనే మృతి చెందడం బాధాకరం అని చెప్పాడు. ప్రస్తుతం శ్రీహరి ఇద్దరు కుమారులను సినిమాల్లోకి తీసుకు వచ్చి సక్సెస్ చేసేందుకు డిస్కోశాంతి ప్రయత్నాలు చేస్తోంది.