ఇండస్ట్రీలో పెద్దల్లో అండదండలు ఉన్నాయంటే ఎవరైనా ఫుల్ స్వింగ్‌లో దూసుకుపోతుంటారు. అప్పటి వరకు పెద్దోల్ల సపోర్ట్ ఉండి.. ఒక్కసారిగా ఆ సపోర్ట్ పోతే వాళ్లు ఒక్కసారిగా పాతాళంలోకి పడిపోతూ ఉంటారు. అలాంటి సంఘటనలు చాలా చూశాం. అదే పెద్దోళ్ల వారసులు ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా వారికి ఎన్ని ఇబ్బందులు వచ్చినా…వారికేం కాదు.. రిలాక్స్‌గా తమ లైఫ్ కంటిన్యూ చేస్తూ ఉంటారు.
మెగాస్టార్ చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మితతో దివంగత హీరో ఉదయ్ కిరణ్‌కు ఎంగేజ్మెంట్ జరిగినప్పుడు ఓ 10 టాప్ బ్యానర్ల నుంచి తమ బ్యానర్లలో ఉదయ్ కిరణ్ హీరోగా సినిమాలు చేస్తున్నట్టు పేపర్లలో ప్రకటనలు వచ్చాయి. ఎంగేజ్మెంట్ జరిగాక వరుసగా టాప్ డైరెక్టర్లు కూడా ఉదయ్ వెంట పడ్డారు. ఎప్పుడు అయితే పెళ్లి క్యాన్సిల్ అయ్యిందో అసలు ఉదయ్ కెరీర్‌లో మళ్లీ హిట్ అన్నది పడలేదు. ఉదయ్ ఇండస్ట్రీలో అనాథ అయిపోయాడు.
కట్ చేస్తే అక్కినేని హీరో అఖిల్‌కు శ్రియా భూపాల్‌తో ఎంగేజ్మెంట్ జరిగి క్యాన్సిల్ అయ్యింది. అఖిల్ భారీ బడ్జెట్ సినిమాలు చేస్తున్నాడు. పైగా ఉదయ్‌కు కెరీర్ స్టార్టింగ్‌లో మూడు సూపర్ హిట్లు.. అదే అఖిల్‌కు మూడు డిజాస్టర్‌లు. ఇండస్ట్రీలో అండ ఉంటే ఏం జరుగుతుంది అనేందుకు ఇదే పెద్ద ఉదాహరణ. ఇక చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజకు కళ్యాణ్ దేవ్‌తో రెండో పెళ్లి జరిగింది. వీరికి కూడా ఓ కుమార్తె.
కళ్యాణ్ డెబ్యూ మూవీ విజేతకు మెగా ఫ్యామిలీ అంతా సోషల్‌మీడియాలో సందడి చేసింది. మెగాభిమానులు కూడా థియేటర్ల దగ్గర సందడి చేశారు. పైగా చిరు సినిమా టైటిలే కళ్యాణ్ డెబ్యూ మూవీ టైటిల్.సినిమా ఆడలేదు. అయితే హంగామా.. హైప్ వచ్చింది. ఎప్పుడు అయితే శ్రీజతో గ్యాప్ వచ్చిందని..విడాకులు తీసుకుంటున్నారన్న వార్తలతో పాటు వీరిద్దరు దూరంగా ఉంటున్నారో కళ్యాణ్‌ను పట్టించుకునే వారే లేరు.
మొన్నామధ్య వచ్చిన సూపర్ మచ్చి మూవీని అసలు పట్టించుకోలేదు. ఓ అనాథలా వచ్చి వెళ్లింది. అసలు ఆ సినిమా వచ్చిన విషయమే చాలా మందికి తెలియదు. ఇక ఇప్పుడు కళ్యాణ్ మూడో సినిమా సూపర్ మచ్చి ల్యాబుల్లో మగ్గుతోంది. రామ్ తాళ్లూరి లాంటి బలమైన నిర్మాత ఉండి కూడా జీరో బజ్ ఉండడంతో ఈ సినిమాను రిలీజ్ చేయడం లేదు. చివరకు ఏదైనా ఓటీటీలో ఇచ్చుకుంటే నాలుగు రూపాయలు వస్తాయి. అసలు థియేటర్లలో రిలీజ్ చేసేందుకు ఈ సినిమాను కొనేవాళ్లే లేకుండా పోయారు.