సినిమా రంగంలో కొన్ని చిత్ర విచిత్రాలు జరుగుతూ ఉంటాయి. ఎవరో ఒక కుర్రాడు తాను చదువుకునే టైంలో కొన్ని సినిమాల నుంచి ప్రేరణ పొంది చివరకు తాను ఎవరి నుంచి ప్రేరణ పొందారో వాళ్లనే మించిపోయే స్థాయికి ఎదుగుతాడు. ఇక చిన్నప్పుడు ఓ హీరో అభిమాని.. పెద్దయ్యాక అదే హీరో పక్కన సినిమా చేయడమో లేదా అదే హీరోను డైరెక్ట్ చేయడమో జరుగుతుంది. ఇలా చాలా మంది దర్శకులను మనం చూశాం.
నందమూరి నటసింహం బాలకృష్ణ అంటే పడిపడిచచ్చిపోయేంత అభిమానం ఉన్న కుర్రాడు చిన్నప్పటి నుంచి బాలయ్య సినిమాలు చూస్తూనే పెరిగాడు. మంగమ్మగారి మనవడు సినిమా వచ్చినప్పుడు ఆ సినిమాను పదే పదే చూశాడు. బాలయ్య అంటే ఎంతో అభిమానం.. బాలయ్య సినిమా వచ్చిందంటే చాలు చూసేయాల్సిందే. అలాంటి కుర్రాడు పెద్దయ్యాక సినిమా డైరెక్టర్ అయ్యి చివరకు తన అభిమాన హీరోనే డైరెక్ట్ చేసేశాడు. ఆ డైరెక్టర్ ఎవరో కాదు ఏఎస్. రవికుమార్ చౌదరి.
మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయిన రవికుమార్ చౌదరి గుంటూరు జిల్లాకు చెందిన వ్యక్తి. ఈ క్రమంలోనే బాలయ్య హీరోగా 2006లో వచ్చిన వీరభద్ర సినిమాకు డైరెక్ట్ చేసే ఛాన్స్ ఆయనకు వచ్చింది. అంబికా కృష్ణ నిర్మాతగా వచ్చిన ఈ సినిమా ప్లాప్ అయ్యింది. ఈ సినిమా రిలీజ్ అయిన ముందు రోజే మహేష్‌బాబు నటించిన పోకిరి రిలీజ్ అయ్యింది.
ఎప్పుడు అయితే బాలయ్య సినిమా కాస్త వీక్‌గా ఉందన్న టాక్ వచ్చిందో పోకిరి కుమ్మేసుకుంది. తన అభిమాన హీరోను డైరెక్ట్ చేసే ఛాన్స్ వచ్చినందుకు తాను ఎప్పటకీ ఆనందపడుతూనే ఉంటానని.. అయితే సినిమా బాగా తీసినా ప్లాప్ అయ్యిందని రవికుమార్ చౌదరి ఓపెన్‌గానే చెపుతారు. ఆ సినిమా షూటింగ్ మధ్యలో ఉండగానే తన పెళ్లి జరిగిందని చెప్పారు.
ఆ తర్వాత తనకు పాప పుట్టాక ఐదేళ్లకు పాప బర్త్ డే రోజు తాను బాలయ్య గారి ఇంటికి వెళ్లి ఆయన్ను కలిసినట్టు చెప్పారు. బాలయ్య తన పాపకు గోల్డెన్ లాకెట్‌తో పాటు చాక్లెట్లు ఇచ్చారని.. బాలయ్య పాపకు చికెన్ సమోసా ఇవ్వగా తింటూ ఉండగా కిందపడితే తాను పాపపై కోప్పడితే బాలయ్య పాపను అంటావా ? అని తనపైనే కోప్పడ్డారని రవికుమార్ చెప్పాడు.
ఇక బాలయ్యతో మళ్లీ సినిమా చేసే ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్నా అని.. ఆయన కూడా రెండు మూడు సార్లు మళ్లీ సినిమా చేయాలని పిలిచారని.. అయితే ఓ సారి ఛాన్స్ ఇస్తే తప్పు జరిగిపోయిందని.. మరోసారి ఆ తప్పు జరగకూడదని.. సరైన కథ రెడీ చేసుకుని అప్పుడే బాలయ్యను కలిసి హిట్ సినిమాయే తీయాలనుకుంటున్నానని రవికుమార్ చౌదరి తెలిపారు.