టాలీవుడ్లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎంత పెద్ద డైరెక్టరో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మధ్యలో కొన్ని ప్లాపులు పడినా కూడా త్రివిక్రమ్ డైరెక్షన్లో సినిమా చేసేందుకు స్టార్ హీరోలు క్యూలో ఉంటారు. అజ్ఞాతవాసి లాంటి డిజాస్టర్‌తో కింద పడిన త్రివిక్రమ్ ఆ తర్వాత అల వైకుంఠపురంలో, అరవింద సమేత వీరరాఘవ లాంటి హిట్ సినిమాలతో ఫామ్‌లోకి వచ్చాడు.
ప్రస్తుతం త్రివిక్రమ్ సూపర్‌స్టార్ మహేష్‌బాబుతో సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన అతడు, ఖలేజా సినిమాలు కమర్షియల్‌గా సక్సెస్ కాకపోయినా త్రివిక్రమ్ టేకింగ్‌కు మంచి మార్కులు పడేలా చేశాయి. త్రివిక్రమ్ ఎక్కువుగా తన సినిమాలు అన్ని హారిక – హాసిని బ్యానర్లోనే ఉంటాయి. అలాగే బయట బ్యానర్లకు కూడా చేస్తాడు.
అయితే టాలీవుడ్లో వరుసగా క్రేజీ ప్రాజెక్టులు సెట్ చేస్తూ దూసుకుపోతోన్న మైత్రీ మూవీస్ వాళ్లకు త్రివిక్రమ్‌కు చెడిందని.. చివరకు ఇది పెద్ద గ్యాప్‌నకు కారణమైందన్న గుసగుసలు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఇందులో వాస్తవ అవాస్తవాలు ఏంటో గాని ప్రస్తుతం ఈ విషయం ఇండస్ట్రీ వర్గాల్లో బాగా హాట్ టాపిక్‌గా మారింది. చివరకు వీరిద్దరి మధ్య గొడవ శాశ్వత వైరంగా మారిందన్న గుసగుసలు కూడా వినవస్తున్నాయి.
మహేష్‌బాబు సర్కారు వారి పాట ప్రి రిలీజ్ ఫంక్షన్ జరిగింది. ఈ ఫంక్షన్‌కు హీరోతో రిలేషన్ ఉన్న ప్రతి దర్శకుడు హాజరవుతాడు. పైగా ఈ ఫంక్షన్‌కు మహేష్‌తో గతంలో సినిమాలు చేసిన దర్శకులు హాజరయ్యారు. ఇక మహేష్ నెక్ట్స్ సినిమా దర్శకుడు త్రివిక్రమ్ సైతం వచ్చి ఉంటే ఈ అనుమానాలకు బలం చేకూరి ఉండేదే కాదు. అయితే అసలు ఈ ఫంక్షన్‌కు త్రివిక్రమ్‌కు పిలుపే వెళ్లలేదని కూడా అంటున్నారు.
చివరకు ఈ గ్యాప్ మైత్రీ వాళ్లు త్రివిక్రమ్‌కు ఇచ్చిన అడ్వాన్స్ సైతం వెనక్కు ఇచ్చేసేంత వరకు వెళ్లిందని అంటున్నారు. మరి ఈ ప్రచారంపై అటు త్రివిక్రమ్ గాని.. ఇటు మైత్రీ వాళ్లు కాని క్లారిటీ ఇచ్చే వరకు ఇది ఇలా కంటిన్యూ అయ్యేలా ఉంది.