టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్‌బాబు ఇటీవల సర్కారువారి పాట సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పరశురాం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే 11 రోజులకు ప్రపంచ వ్యాప్తంగా రు. 110 కోట్ల షేర్ రాబట్టిన సర్కారు వారి పాట తర్వాత మహేష్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో సినిమాలు చేస్తోన్న సంగతి తెలిసిందే.
రాజమౌళి సినిమా కంటే ముందు మహేష్.. త్రివిక్రమ్ సినిమాయే ఉంటుంది. హారిక & హాసిని బ్యానర్ భారీ బడ్జెట్‌తో నిర్మించే ఈ సినిమా షెడ్యూల్ త్వరలోనే ప్రారంభం కానుంది. SSMB 28 గా పిలుచుకొనే ఈ సినిమాకి ఫైనల్ స్క్రిఫ్ట్ టాక్ చేసే పనిలో త్రివిక్రమ్ ఉన్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాకు త్రివిక్రమ్ తన పాత సినిమాల సెంటిమెంట్ కూడా ఫాలో అవుతూ టైటిల్ పెట్టే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.
త్రివిక్రమ్‌కు అ అక్షరం సెంటిమెంట్ ఉంది. అతడు – అత్తారింటికి దారేది – అఆ – అరవింద సమేత వీరరాఘవ – అల వైకుంఠపురములో సినిమాలు అన్నీ బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టాయి. ఇప్పుడు ఈ సెంటిమెంట్‌తోనే అ అక్షరం కలిసి వచ్చేలా మహేష్‌బాబు సినిమాకు అర్జనుడు టైటిల్ పెడుతున్నారు అట. ఇది క్యాచీ టైటిల్ పవర్ ఫుల్ టైటిల్.
గతంలో మహేష్ అర్జున్ టైటిల్‌తో గుణశేఖర్ దర్శకత్వంలో ఓ సినిమా చేశాడు. ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర జస్ట్ ఓకే అనిపించుకుంది. ఇప్పుడు అర్జనుడు పేరుతో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమా టైటిల్ మహేష్ తండ్రి కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా టైటిల్, లోగో మే 31న రివీల్ చేస్తారట. ఇక అర్జనుడు అండే పాండవ మధ్యముడు. కురుక్షేత్ర సంగ్రామంలో తన గాండీవంతో ధుర్యోధనుడిని సంహరించాడు.
ఇక ఈ సినిమా విషయానికి వస్తే తన కుటుంబం కోసం ప్రత్యర్థుల్ని ఎలా ?గడగడలాడించాడు ? అన్న కథాంశంతో ఉంటుందట. అతడు సినిమాకు ముందుగా పార్దు టైటిల్ అనుకున్నారు. అయితే త్రివిక్రమ్ ఆ ప్రయత్నం మానుకుని అతడు అని పెట్టారు. ఇప్పుడు పార్దుకు పర్యాయపదంగా ఉన్న అర్జనుడు అనే టైటిల్‌తో మళ్లీ మహేష్‌తో సినిమా చేస్తున్నాడు. 2010లో వచ్చిన ఖలేజా తర్వాత మహేష్ – త్రివిక్రమ్ కాంబోలో వస్తోన్న సినిమా ఇదే.