తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న నటుడు రాహుల్ రామకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కమెడియన్ గా రాణిస్తూ..దూసుకుపోతున్నాడు. ‘అర్జున్ రెడ్డి, జాతిరత్నాలు’ లాంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల మనసులు చూరగొన్న రాహుల్.. స్టార్స్ సినిమాలో కూడా తనదైఅన కామెడీ టైమింగ్ తో చించేశాడు. ఇక కల్కి, స్కైలాబ్ మూవీస్ లో నటించి మెప్పించిన రాహుల్ ..తన జీవితానికి సంబంధించిన బిగ్ అప్ డేట్..అభిమానులతో షేర్ చేసుకున్నాడు.
యస్.. రాహుల్ రామకృష్ణ పెళ్లి చేసుకోబోతున్నాడు. అంత వరకు బాగానే ఉంది. ఆ విషయాని తన అభిమానులకు చెప్పాలి అనుకున్నాడు అ ది బాగానే ఉంది. కానీ తన కాబోయే భార్య ఫోటోని పోస్ట్ చేశారు. అది కూడా ఆమె కు ముద్దు పెడుతూ. బుగ్గ మీద కాదండోయ్.. ఇంగ్లీషు వాళ్ళ స్టైల్ లో..కాస్త వెరైటీ గా లిప్ కిస్ పెడుతూ.. త్వరలోనే పెళ్లి చేసుకుంటున్నా అంటూ అర్జున్ రెడ్డి స్టైల్ లో చెప్పుకొచ్చాడు. దీంతో అభిమానులు శుభాకాంక్షలు చెప్పుతున్నా..ఏంటి ఇది రాహుల్ అంటూ మడిపడుతున్నారు. కొందరు నువ్వు కేక సామీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
తెలుగులో కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్న రాహుల్ రామకృష్ణ ఈ సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్ గా ఉంటూ ఉంటాడు. సినీ, రాజకీయ అంశాల నుండి హ్యూమరస్ పోస్టుల వరకు రాహుల్ ఎప్పుడూ ట్వీట్లు పోస్టులు పెడుతుంటాడు. కాగా, రీసెంట్ గా ఆయన పెళ్లికి సంబంధించిన వార్త చెప్పుతూ పోస్ట్ చేసిన పిక్ సినీ వర్గాలల్లో చర్చ నీయాంశంగా మారింది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్గా మారింది. ఈ ఫోటో చూసిన నెటిజన్లు.. అసలైన జాతిరత్నానివి నువ్వు.. అర్జున్ రెడ్డి స్టైల్లో చెప్పినవ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే.. గతంలో సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించి తర్వాత తూచ్ జోక్ చేశానన్న రాహుల్.. ఈ పెళ్లి వార్తలో ఎలాంటి జోక్ లేకుండా ఓ ఇంటి వాడవుతాడో లేదో చూడాలి.
Getting married, finally, soonly! pic.twitter.com/o4Fg5XlsT6
— Rahul Ramakrishna (@eyrahul) May 7, 2022