సమంతతో విడాకులు తీసుకున్నప్పటి నుంచే నాగచైతన్య సైలెంట్‌గా ఉంటూ వస్తున్నాడు. పెద్దగా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉండడం లేదు. సమంత విడాకులు ఇవ్వడానికి ముందు నుంచే రకరకాల అర్థాలు వచ్చేలా సోషల్ మీడియాలో ఏదో ఒక కామెంట్లు పెడుతూనే వస్తోంది. సమంత పెడుతోన్న కామెంట్లలో కొన్ని మరీ అక్కినేని ఫ్యామిలీతో పాటు చైతును టార్గెట్ చేస్తున్నట్టుగా ఉన్నాయన్న ప్రచారం కూడా ఉండనే ఉంది.
విడాకుల తర్వాత చైతు – సమంత ఇద్దరూ కూడా పూర్తిగా సినిమాల్లో బిజీ అయిపోయారు. చైతుకు లవ్‌స్టోరీ, సంక్రాంతికి బంగార్రాజు లాంటి హిట్ సినిమాలు వచ్చాయి. తాజాగా దిల్‌రాజు బ్యానర్లో చైతు నటించిన థ్యాంక్ యు సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ టీజర్ రిలీజ్ అయ్యింది. ఈ టీజర్లో చైతు చెప్పిన డైలాగ్ ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది.
చైతు చెప్పిన ఆ డైలాగ్ అంటే లైఫ్ లో కాంప్రమైజ్ అయ్యే ప్రశక్తే లేదు.. ఎన్నెన్నో వదులుకుని ఇక్కడిదాకా వచ్చాను.. అని చైతు అంటాడు. చైతు చెప్పిన ఈ డైలాగ్ తన మాజీ భార్యను ఉద్దేశించి చెప్పిందే అన్న చర్చలు బాగా నడుస్తున్నాయి. ఇప్పటి వరకు సమంతకు చైతు ఇలాంటి రిటాక్ట్లు ఇచ్చిన సందర్భాలు అయితే లేవు. ఎప్పుడూ సమంతనే సోషల్ మీడియాలో ఏదో ఒక కామెంట్లు పెడుతూ రెచ్చగొడుతూ వస్తోందన్న టాకే ఎక్కువుగా ఉంది.
అయితే ఇప్పుడు చైతుకు మాంచి ఛాన్స్ రావడంతో టీజర్లో డైలాగ్‌తో సమంతకు చెంప దెబ్బ లాంటి ఆన్సర్ ఇచ్చాడని చైతు, అక్కినేని అభిమానులు రెచ్చిపోతున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి చూసినా కూడా ఆ డైలాగ్ కరెక్టుగా యాప్ అవుతుందని కూడా వారు చెపుతున్నారు. అంటే చైతు నువ్వు చెప్పినట్టు ఆడే బొమ్మను అయితే కాదని.. నాకు ఓ మనస్సు, ఆత్మాభిమానం ఉందని పరోక్షంగా చెప్పకనే చెప్పాడని చర్చించుకుంటున్నారు.
అయితే ఈ టీజర్ వచ్చాక సమంత కూడా డెడ్ అనే ట్వీట్ పెట్టి వెంటనే డిలీట్ చేసినట్టు తెలుస్తోంది. ఇది చైతుకు కౌంటర్‌గా ఇచ్చిందా ? లేదా ? ఆమె ఉద్దేశం ఏంటన్నది మాత్రం ఎవ్వరికి అర్థం కావడం లేదు. ఇక విక్రమ్ కుమార్ దర్శకత్వం వహిస్తోన్న థ్యాంక్ యు సినిమాలో రాశీఖన్నా, అవికాగోర్ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాలో చైతన్య స్వార్థపూరిత వ్యక్తిగా కనిపిస్తాడని అంటున్నారు.