MoviesF3 సినిమాలో బిస్కెట్ క్యారెక్టర్ ఇదే..లెక్క తప్పిందే..?

F3 సినిమాలో బిస్కెట్ క్యారెక్టర్ ఇదే..లెక్క తప్పిందే..?

హమ్మయ్య .. ఎట్టకేలకు అనిల్ రావిపూడి అనుకున్న విధంగా సక్సెస్‏ఫుల్ గా F3 సినిమాని ధియేటర్స్ లో రిలీజ్ చేశారు. నేడు గ్రాండ్ గా ధియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫిస్ వాద్ద సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. వెంకటేశ్.. వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ చిత్రం ఎఫ్ 3. గతంలో సూపర్ హిట్ అయిన ఎఫ్ 2 సినిమాకు సిక్వెల్‏గా ఈ సినిమాను తెరకెక్కిన విషయం తెలిసిందే.

సేమ్ F2 లో నటించిన హీరోయిన్స్ నే ఇందులో కూడా కనిపించారు. మిల్కీ బ్యూటీ తమన్నా.. మెహ్రీన్ ఫిర్జాదా హీరోయిన్లుగా నటించి..గ్లామరస్ గా మెప్పించారు. అయితే, ఫ్3 లోకి కొత్తగా మరో ముద్దుగుమ్మ ను ఎంటీ ఇచ్చి..సినిమాకి మరింత హైప్ తెచ్చిన అనిల్..రిలీజ్ అయ్యాక మాత్రం పరిస్ధితి తేడా గా ఉంది. అస్సలు అనిల్ ఈ సినిమాలో సోనాలీ ని ఎందుకు పెట్టారో కూడా అర్ధం కావడం లేదంటున్నారు సినిమా చూసిన జనాలు.

సినిమాలో మూడో హీరోయిన్ గా సోనాలీ నటిస్తుంది అని అనగానే అందరూ..ఓ రేంజ్ లో ఎక్స్ పెక్ట్ చేశారు. రామ్ నటించిన పండగ చేస్కో సినిమాలో ఆమె పర్ ఫామెన్స్ చూసిన వాళ్ళు..F3 లో ఆమె క్యారెక్టర్ చూస్తే.. అనీల్ సోనాలీ ని వాడుకోవడం లో ఫెయిల్ అయ్యాడు అంటారు. అలా ఉంది సినిమాలో సోనాలీ పాత్ర. ఏదో తమన్నా కోసం ఆ పాత్రకి ఇరికించిన్నట్లు ఉందే కానీ..ఆ పాత్ర వల్ల ఉపయోగమే లేదంటూ..సినిమాలో బిస్కెట్ క్యారెక్టర్ అంటూ ట్రోల్ చేస్తున్నారు. మరి కలెక్షన్స్ పరంగా సినిమా ఎలా ఉంటుందో చూడాలి..?

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news