నందమూరి నటసింహం బాలకృష్ణ కెరీర్‌లో ఎన్నో చెక్కుచెదరని రికార్డులు ఉన్నాయి. బాలయ్య గట్టిగా గురి చూసి కొడితే అప్పటి వరకు ఉన్న ఇండస్ట్రీ రికార్డులు ఖల్లాస్ అయిపోతాయి. బాలయ్య కెరీర్‌లో 1986లో ఓ జైత్రయాత్ర కొనసాగింది. ఈ జైత్రయాత్రకు శ్రీకారం చుట్టిన సినిమా ముద్దుల క్రిష్ణయ్య. ఒకే యేడాది బాలయ్య నటించిన ఏడు సినిమాల్లో ఆరు సినిమాలు సూపర్ హిట్ అయ్యి బాక్సాఫీస్‌ను షేక్ చేయడం అంటే మామూలు విషయం కాదు. ఈ ఘనత నందమూరి నటసింహానికే దక్కింది.
ఈ యేడాది రిలీజ్ అయిన ముద్దుల క్రిష్ణయ్య వసూళ్లలోనే కాకుండా.. అనేక సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. బాలయ్యకు కలిసి వచ్చని భార్గవ్ ఆర్ట్స్ బ్యానర్లో తెరకెక్కిన ఈ సినిమాకు కోడి రామకృష్ణ దర్శకత్వం వహించారు. కృష్ణయ్యగా బాలయ్య నటిస్తే విజయగా విజయశాంతి, రాధగా రాధ నటించారు. 1986 ఫిబ్రవరి 28న ఈ సినిమా థియేటర్లలోకి వచ్చింది.
ఈ సినిమా ఫస్ట్ వారమే కోటి రూపాయలకు పైగా (రూ: 1,09,91,401/-) వసూలు చేసి అప్పటి వరకూ ఉన్న కలెక్షన్ల రికార్డులను తుడిచిపెట్టేసి ఇండస్ట్రీ రికార్డ్ సాధించింది. అలాగే స్లాస్ సిస్టమ్‌లో కోస్టల్ ఆంధ్రాలో ఒకే కాంప్లెక్స్‌లో 3 ఆటలతో 175 రోజులు ఆడిన ఏకైక సినిమా. 20కు పైగా థియేటర్లలో 175 రోజులు ఆడింది. అలాగే ఒక్క హైదరాబాద్‌లోనే సుభాష్ – శేష్‌మహాల్ – సికింద్రాబాద్ మనోహర్ థియేటర్లలో 175 రోజులు ఆడింది.
ఇక టాలీవుడ్ సినీ చరిత్రలో ఇప్పటి వరకు ఎవ్వరూ టచ్ చేయని.. భవిష్యత్తులో కూడా ఎవ్వరూ టచ్ చేయని అరుదైన రికార్డ్ ఈ సినిమాతోనే బాలయ్య నమోదు చేశారు. ఓ సినిమాను థియేటర్ షిఫ్ట్ చేశాక 101 రోజులు హౌస్ ఫుల్స్ ఆడడం అంటే మామూలు విషయం కాదు. ఇది నిజంగా అసాధ్యం. కానీ అసాధ్యం అనుకున్న ఎన్నో రికార్డులను సుసాధ్యం చేసిన బాలయ్య ఈ రికార్డు సొంతం చేసుకున్నారు. విజయవాడ శకుంతల థియేటర్లో సినిమా షిఫ్ట్ చేశాక 101 రోజుల హౌస్ ఫుల్స్ పడింది. అసలు ఈ రికార్డు భవిష్యత్తులో కూడా ఏ హీరో టచ్ చేయడం అసాధ్యమే.
ఇక గుంటూరు నాజ్ అప్సరలో ఏకంగా 175 రోజులు అన్ని ఆటలు హౌస్‌ఫుల్ అయ్యాయి. అలాగే లేట్ రిలీజ్‌లో రేపల్లె శ్రీకృష్ణ, కైకలూరు విజయలక్ష్మి థియేటర్లలో శతదినోత్సవం జరుపుకుంది. ఇక ఓవరాల్‌గా
మూడు కేంద్రాలలో ( హైదరాబాద్, గుంటూరు, విజయవాడ ) స్వర్ణోత్సవం (365 Days) జరుపుకున్న సినిమాగా ముద్దుల క్రిష్ణయ్య నిలిచింది. ఇక అదే యేడాది మరో 5 సినిమాలు కూడా సూపర్ హిట్ అవ్వడంతో బాలయ్యకు డబుల్ బ్లాక్‌బస్టర్ హిట్స్ దక్కాయి.