బాలయ్య – బోయపాటి శ్రీనుది ఎంత ఇంట్రస్టింగ్ కాంబినేషనో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బాలయ్యకు ఒకప్పుడు కోడి రామకృష్ణ, ఆ తర్వాత కోదండ రామిరెడ్డి.. ఆ తర్వాత బి.గోపాల్.. ఇక ఈ కాలంలో బోయపాటి శ్రీను అలా అండగా నిలబడ్డారు. ఓ హీరో, దర్శకుడి కాంబినేషన్లో ఒకటి, రెండు హిట్ సినిమాలు రావడమే ఇప్పుడు గగనం అవుతోంది. అయితే బాలయ్య – బోయపాటి కాంబోలో ఏకంగా ఒకటి కాదు.. రెండు కాదు మూడు బ్లాక్‌బస్టర్లు వచ్చాయి. ఈ మూడు సినిమాలు కూడా ఒక దానిని మించి మరొకటి వచ్చాయి.
2010లో సింహా సినిమాకు ముందు వరకు బాలయ్య కెరీర్ బాగా డల్‌గా ఉంది. ఆ టైంలో వచ్చిన సింహా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. కట్ చేస్తే నాలుగేళ్లకు 2014 సమ్మర్‌లో మరోసారి వీరి కాంబోలో లెజెండ్ వచ్చింది. లెజెండ్ బాలయ్యకు చాలా రకాలుగా కలిసొచ్చింది. ఈ సినిమా సింహాను మించిన బ్లాక్‌బస్టర్ అవ్వడంతో పాటు ఓ థియేటర్లో 400 రోజులు ( ఆదోనీ), ప్రొద్దుటూరులో షిఫ్టింగ్‌తో కలుపుకుని 1000 రోజులు ఆడింది.
2014 తర్వాత మళ్లీ బాలయ్య – బోయపాటి కాంబినేషన్ ఎప్పుడు వస్తుందా ? అని కళ్లు కాయలు కాచేలా వెయిట్ చేసిన అభిమానుల ఆకలి అఖండ తీర్చింది. 2021 చివర్లో కరోనా మూడో వేవ్ తర్వాత వచ్చిన ఈ సినిమా థియేటర్లలో సినిమాలు చూస్తోన్న అభిమానులకు పూనకాలు తెప్పించేసింది. అఖండ గర్జనతో బాక్సాఫీస్ మార్మోగిపోయింది. బాలయ్య – బోయపాటి కాంబినేషన్లో వచ్చిన మూడు సినిమాలు హ్యాట్రిక్ హిట్లు కొట్టడం ఓ ఎత్తు అయితే మరో అదిరిపోయే రికార్డు కూడా ఈ కాంబినేషన్ సొంతం అయ్యింది.
ఈ మూడు సినిమాలు డబుల్ సెంచరీలు ( అఖండ రన్నింగ్‌లో ఉంది) కొట్టేశాయి. సింహా సినిమా ఆదోని ప్రభాకర్, జమ్మలమడుగు అలంకర్ థియేటర్లలో 175 రోజులు ఆడింది. విశాఖపట్నం సిటీలోని గోపాలపట్నం మౌర్య థియేటర్లో 200 రోజులు ఆడింది. ఇక లెజెండ్ అయితే ఎమ్మిగనూరులో 400, ప్రొద్దుటూరులో 1000 రోజులు ఆడి చరిత్ర క్రియేట్ చేసింది.
తాజా అఖండ డైరెక్టుగా 4 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. అఖండ చిలకలూరిపేట రామకృష్ణ థియేటర్లో 150 రోజులు దాటేసి 175కు పరుగులు పెడుతోంది. ఈ సినిమా ఇక్కడ 175 ఆడడం ఖరారైంది. అదే ఊపులో 200 రోజులు ఆడితే బాలయ్య – బోయపాటి కాంబోలో 3 డబుల్ సెంచరీలు వచ్చినట్లవుతుంది. ఇది ఇటీవల కాలంలో ఏ హీరో, డైరెక్టర్‌కు లేని అరుదైన రికార్డు అని చెప్పాలి.