సినీ ఇండస్ట్రీలోకి ఎంత మంది వచ్చినా..కొందరి హీరోయిన్స్ స్దానాని ఎవరు భర్తి చేయలలేరు. సావిత్రి, సౌందర్య, ప్రత్యూష, అనుష్క..వీళ్లు హీరోయిన్స్ గా ప్రేక్షకుల మదిలో టాప్ ప్లేస్ లో ఉన్నారు. టాలీవుడ్ జేజమ్మ గా పాపులర్ అయిన ..అనుష్క శెట్టి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆమె అందానికి పడిపోని కుర్రాళ్లు ఉండరు..కేవలం అందం మాత్రమే కాదు..నటన పరంగా కూడా అమ్మడు ది బెస్ట్ అని చెప్పవచ్చు.
ఒకప్పుడు వరుస సినిమాలకు కమిట్ అయ్యిన ఈ బ్యూటీ..ఇప్పుడు అవకాశాలు వస్తున్న కానీ..సైలెంట్ గా ఉంటుంది. దానికి కారణం ఆమె బరువు. యోగా టీచర్ అయిన ఆమె కూడా తన బరువు ని తగ్గించుకోలేకపోతుంది. ఈ క్రమంలోనే అమ్మడి సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది. కాగా, ఆమె ఇప్పటి వరకు కమిట్ అయిన సినిమా ఒక్కటే. పి.మహేశ్ దర్శకత్వంలో యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి హీరో గా, అనుష్క హీరోయిన్ గా ఓ సినిమా కి కమిట్ అయ్యింది.
ఇక ఈ సినిమా కథ ఏంటన్నది బయటకు వచ్చింది. 37 ఏళ్ల వయస్సు ఉన్న ఓ ఆంటీ.. తన కంటే పదేళ్లు చిన్నోడు అయిన ఓ 27 ఏళ్ల అబ్బాయితో ప్రేమలో పడుతుందట. ఈ ప్రేమ వల్ల వాళ్లు ? ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు… చివరకు ఏమైంది అన్న నేపథ్యంలో సినిమా ఉంటుందని తెలుస్తోంది. అయితే, ఈ సినిమా కోసం అనుష్క బరువు తగ్గదానికి చాలా ట్రై చేస్తుందట. కానీ, వర్క్ అవుట్ అవ్వడం లేదట. చాలా కాలంగా బరువు సమస్యతో ఇబ్బంది పడుతున్న అనుష్క కి ..నాచురల్ గా లావు తగ్గడమే ఇష్టమట. ఇప్పటికే అనుష్క బాడీ షేప్స్ పై రకరకాల ట్రోలింగ్స్ వస్తున్నాయి.
ఈ క్రమంలో ఆమె మల్ళీ లావుగా కనిపిస్తే..కచ్చితంగా ఆమె ని ఇబ్బంది పెడతారు Trollers. దీనితో తాను బరువు తగ్గిన తర్వాతే సెట్స్ లోకి ఎంటర్ అవుతానని యువీ నిర్మాతలకు అనుష్క తేల్చి చెప్పేసిందట. అంతేకాదు, బరువు తగ్గడానికి,…ఆపరేషన్స్, స్పెషల్ ట్రీట్ మెంట్స్ కాకుండా..సహజ పద్ధతిలోనే బరువు తగ్గుతాను అని భీష్మించుకుని కూర్చుందట అనుష్క. దీంతో సినిమా షూటింగ్ లేట్ అయ్యే ఛాన్సులే ఎక్కువుగా కనిపిస్తున్నాయి.