అక్కినేని ఫ్యామిలీ నుంచి మూడో తరం వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన అఖిల్ వరుస డిజాస్టర్ల తర్వాత ఎట్టకేలకు గతేడాది వచ్చిన మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ సినిమాతో ఓ హిట్ కొట్టాడు. ఈ సినిమా కూడా సూపరెహే అన్నట్టుగా లేకపోయినా జస్ట్ ఓకే. గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్, బన్నీ వాస్‌తో పాటు బొమ్మరిల్లు తర్వాత జనాలు మర్చిపోయిన భాస్కర్ ఎంతో దృష్టి పెట్టి చేసిన సినిమా కావడం.. ముందుగానే సాంగ్స్ హైలెట్ కావడం.. ఫామ్‌లో ఉన్న పూజా హెగ్డే హీరోయిన్ కావడంతో ఎట్టకేలకు ఈ సినిమా హిట్ అయ్యింది అనిపించుకుంది.
ఈ సినిమా తర్వాత మరోసారి భారీ బడ్జెట్ సినిమాకే అఖిల్ ఓటేశాడు. స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఏజెంట్ సినిమా చేస్తున్నాడు. సైరా తర్వాత చాలా లాంగ్ గ్యాప్ తీసుకుని సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తోన్న సినిమా అఖిల్. ఈ సినిమా కోసం ఏకంగా రు. 50 కోట్లకు పైనే బడ్జెట్ పెడుతున్నారని.. హీరో అఖిల్ కూడా సినిమా మేకింగ్, క్వాలిటీ కోసం తన రెమ్యునరేషన్ సైతం త్యాగం చేశాడని ప్రచారం జరుగుతోంది.
అఖిల్ తనకు సినిమా హిట్ అవ్వడమే కావాలని.. సినిమాకు తన మార్కెట్ రేంజ్‌ను మించి ఖర్చు పెట్టినా ఇబ్బంది పడవద్దని.. తన రెమ్యునరేషన్ వదులుకుంటున్నానని నిర్మాతకు ముందే భరోసా ఇవ్వడంతో వాళ్లు కూడా డేరింగ్‌గా ఖర్చు పెట్టేస్తున్నారు. అయితే బాక్సాఫీస్ దగ్గర ఏజెంట్‌కు అంత బజ్ అయితే లేదు. ట్రేడ్ వర్గాలు సైతం అడ్వాన్స్‌లు ఇచ్చి ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు వెనుకాడుతున్నట్టు భోగట్టా..!
ఏజెంట్ ఆగస్టు 12న విడుదల అవుతోంది. ఆగస్టు 15 ను క్యాష్ చేసుకోవాలని ఎప్పుడో ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించారు. అయితే ఈ సినిమాకు పోటీగా వస్తోన్న సినిమాల సంఖ్య క్రమక్రమంగా పెరిగిపోతోంది. నాగచైతన్య స్పెషల్ రోల్ చేసిన అమీర్‌ఖాన్ లాల్‌సింగ్ చద్దా ఆగస్టు 11న వస్తోంది. అదే ఆగస్టు 12న సమంత థ్రిల్లర్ యశోద రిలీజ్ అవుతోంది. ఈ రెండు సినిమాల నుంచే గట్టి పోటీ తప్పదు అనుకుంటోన్న టైంలో ఏజెంట్‌కు ఇప్పుడు మరో సినిమా నుంచి గట్టి పోటీ తప్పేలా లేదు.
నితిన్ హీరోగా తెరకెక్కుతోన్న మాచర్ల నియోజకవర్గం కూడా ఏజెంట్ రిలీజ్ రోజునే ఆగస్టు 12న వస్తోంది. నితిన్ – అఖిల్ బెస్ట్ ఫ్రెండ్స్. భారీ బడ్జెట్ ఒక ఎత్తు అయితే.. ఇటు సినిమాపై బజ్ లేదు అనుకుంటోన్న టైంలో ఇన్ని సినిమాల మధ్యలో వస్తోన్న ఏజెంట్‌కు బాక్సాఫీస్ దగ్గర ఊపిరి ఆడే పరిస్థితి లేదు.