మనకు ఇటీవల కాలంలో ఇద్దరు మాజీ ముఖ్యమంత్రుల భార్యలు ఎక్కువుగా ఈ తరం జనరేషన్‌కు కనెక్ట్ అయ్యేలా వార్తల్లో ఉంటూ ఉంటారు. వాళ్లు ఎవరో కాదు కర్నాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి రెండో భార్య రాధిక. మొదటి భార్య అనితకు దూరమయ్యాక డిస్ట్రిబ్యూటర్‌గా ఉన్న కుమారస్వామి హీరోయిన్‌గా ఉన్న రాధికను పెళ్లాడడం.. చాలా రోజులుగా వీరు సీక్రెట్‌గా సహజీవనం చేయడం.. తర్వాత ఈ దంపతులకు ఓ కుమారుడు పుట్టడం జరిగాయి.
ఇక మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ భార్య బ్యాంకర్ అమృత ఫడ్నవీస్ కూడా అప్పుడప్పుడు ర్యాంప్ వాక్‌లు చేస్తూ తన హోయలు ఒలికిస్తూ ఉంటుంది. ఆమెకు మోడలింగ్ అంటే ఇష్టం. అమృత అచ్చు హీరోయిన్‌లా కనిపిస్తూ ఉంటుంది. తాజాగా ఆమె ఫ్రాన్స్‌లో జరుగుతోన్న కేన్స్ 75వ ఫిల్మ్ ఫెస్టివల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆమె రెడ్ కార్పైట్‌పై నడిచి హోయలు ఒలకబోశారు.
ఆమె ర్యాంప్ వాక్ చేసిన ఫొటోలను తన ఇన్‌స్టాలో షేర్ చేయగా అవి వైరల్ అయ్యాయి. ఈ సందర్భంగా అమృత ఆహారం, ఆరోగ్యం, స్థిరత్వంపై అవగాహన పెంచేందుకే తాను రెడ్ కార్పెట్‌పై నడిచాను అంటూ పోస్ట్ రాసుకువచ్చారు. అమృతతో పాటు ఐవరీకోస్ట్ ప్రథమ మహిళ డొమినిక్ ఔట్టరా లెబనీస్, జోర్డానియన్ యువరాణి గిడా తలాల్, నటుడు స్టోన్ తదితరులు కూడా ఆమెతో పాటు ఉన్నారు.
అమృత బ్యాక్‌గ్రౌండ్ విషయానికి వస్తే ఆమె ఓ సామాజిక కార్యకర్త. ఈ క్రమంలోనే దేవేంద్ర ఫడ్నవీస్‌ను ప్రేమించి 2005లో పెళ్లి చేసుకుంది. ఆమె ఓ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన మహిళ. అమృత నాగ్ పూర్ లోని జీఎస్ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ ఎకనామిక్స్ లో గ్రాడ్యుయేషన్ చేశారు. ఆ తర్వాత ఆమె ఏంబీఏ ఫైనాన్స్ చేశారు. అనంతరం పూణేలోని సింబయాసిస్ స్కూల్లో లా టాక్సేషన్ చదివారు.
ఆమె స్కూల్ స్టేజ్‌లో ఉండగానే అండర్ 16 టెన్నీస్ క్రీడాకారిణిగా గుర్తింపు పొందారు. ఆమెలో చాలా టాలెంట్ ఉంది. ఆమె బహుముఖ ప్రజ్ఞాశాలి అని చెప్పాలి. ఆమె ఓ క్లాసికల్ సింగర్… పాటలు అందంగా పాడతారన్న పేరు పొందారు. అలాగే ప్రొఫెషనల్ బ్యాంకర్. మహారాష్ట్ర చరిత్రలోనే పిన్న వయస్కురాలు అయిన ప్రథమ మహిళగా గుర్తింపు పొందారు. భర్త ముఖ్యమంత్రి అయినా ఆయన సంపాదన మీద బతికేందుకు ఆమె ఇష్టపడరు. ఇప్పటకీ ఆమె యాక్సిస్ బ్యాంక్‌లో వైస్ ప్రెసిడెంట్‌గా పని చేస్తున్నారు.