టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. యంగ్ హీరోలలో స్టార్ హీరోగా దూసుకుపోతున్నారు. అల వైకుంఠ పురంలో లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత చాలా ఏళ్లు గ్యాప్ తీసుకుని తన జాన్ జిగిడి ఫ్రెండ్ సుకుమార్ డైరెక్షన్ లో పుష్ప అనే సినిమాలో నటించి..అలరించి..అభిమానులను మెప్పించి..పాన్ ఇండియా హీరో గా సెటిల్ అయిపోయాడు . నిజం చెప్పాలంటే ఈ సినిమా తరువాతనే బన్నీ క్రేజ్ ఒక్కసారిగా డబుల్ అయిపోయింది.
బన్నీ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప 2 సినిమాలో నటించడానికి సిద్ధంగా ఉన్నాడు . ఇప్పటికే పోస్ట్ ప్రోడక్షన్స్ పనులు అన్ని కంప్లీట్ అయిపోయాయి. త్వరలోనే షూటింగ్ పనులను లాంఛనంగా ప్రారంభిస్తారు అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది. ఈ క్రమంలోనే బన్ని ఎంత మంచి వాడో తన మామ రీసెంట్ గా ఓ యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యుల్లో చెప్పుకొచ్చారు. మనకు తెలిసిందే బన్నీ ..స్నేహారెడ్డి అనే అమ్మాయిని ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు.
బన్నీ భార్య టిఆర్ఎస్ పార్టీ కీలక నేత ప్రభాకర్ రెడ్డి కుమార్తె స్నేహ రెడ్డి. బన్నీతో ప్రేమలో పడినప్పుడు ఆమె తమ సొంత కాలేజ్‌లకు చైర్మన్‌గా వ్యవహరించారు. అయితే , బన్నీ అప్పట్లో తన మామ దగ్గర నుండి కట్నం ఓ రేంజ్ లో తీసుకున్నాడు అంటూ వార్తలు వినిపించాయి.
కాగా, అవన్నీ ఫేక్ అంటూ బన్నీ మామ ఒక్క మాటతో కొట్టేసిన్నట్లైంది. రీసెంట్ ఇంటర్వులో ఆయన మాట్లాడుతూ ఇదే ప్రశ్న ఎదురవ్వగా..”బన్నీ అసలు కట్నం తీసుకోలేదు అని..మా అల్లుడు బంగారం” అంటూ ఓ రేంజ్ లో పొగిడేసారు. “వాళ్ళకి కట్నం తీసుకోవాల్సిన అవసరం లేదని..వాళ్లకు బోలేడు ఆస్తులు ఉన్నాయని. అయినా, మా అల్లుడికి కట్నం తీసుకోవడం ఇష్టం లేదని” చెప్పుకొచ్చారు. దీంతో బన్నీ పేరు నెట్టింట మారు మ్రోగిపోతుంది.
ఇక బన్నీతో పాటు భార్య స్నేహారెడ్డికి సోషల్ మీడియా క్రేజ్ ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాలో ఏ పోస్ట్ పెట్టినా… ఫోటో షేర్ చేసిన కూడా కామెంట్లు… లైకుల వర్షం లక్షల్లోనే ఉంటుంది. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్న సంగతి తెలిసిందే. బన్నీ తన భార్యతో పాటు పిల్లలతో కలిసి సోషల్ మీడియాలో ఎప్పుడూ సందడి చేస్తూనే ఉంటాడు. వ్యవహరించారు.