మెగాస్టార్ చిరంజీవి, మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన సినిమా నే ‘ఆచార్య’. భారీ అంచనాల మధ్య ఈ వారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని మెగాభిమానులు వేయి కళ్లతో ఎదురు చూశారు. సినిమా ఓ రేంజ్ లో హిట్ అవుతుందని ఆశలు పెట్టుకున్నారు. కానీ సీన్ కట్ చేస్తే బాక్స్ ఆఫిస్ వద్ద భారీ డిజాస్టర్ గా నిలిచింది. కొరటాల డైరెక్షన్ అంటే ఏదో ఎక్స్ పెక్ట్ చేసిన జనాలను నిరాశ పరిచాడు డైరెక్టర్.
సినిమా టాక్ డిజాస్టర్ అయిన..మొదటి రోజు కలెక్షన్స్ బాగానే రాబట్టింది. ఓవర్ ఆల్ గా 42 కోట్లు గ్రాస్ సాధించింది. అయితే రెండో రోజు మాత్రం సినిమాకు భారీ బొక్క వేశారు జనాలు. సినిమాకు నెగిటివ్ టాక్ రావడంతో…రెండో రోజు కలెక్షన్స్ భారీ గా పడిపోయాయి. తెలుగు రాష్ట్రాల్లో ఓపినింగ్ డే బాగుందనిపించుకున్న ఆచార్య.. రెండో రోజు చాలా చోట్ల కలెక్షన్స్ డ్రాప్ అయ్యాయి. రెండో రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి కేవలం రూ. 5.15 కోట్ల షేర్‌ని మాత్రమే రాబట్టింది. నిజానికి ఇది మెగా హీరో సినిమా కి రావాల్సిన కలెక్షన్స్ కావు ఇవి.
ఏరియా వారీలు గా ఆచార్య సెకండ్ డే కలెక్షన్స్ చూసుకుంటే.. నైజాంలో రూ.2.20 కోట్లు, , సీడెడ్‌లో రూ. 63 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ.53 లక్షలు, ఈస్ట్‌లో రూ. 33 లక్షలు, వెస్ట్‌లో రూ. 28 లక్షలు, గుంటూరులో రూ. 50 లక్షలు, కృష్ణాలో రూ. 43 లక్షలు , నెల్లూరులో రూ. 25 లక్షల కలెక్షన్స్‌ని రాబట్టింది. రెండు రోజుల్లో ప్రపంచవ్వాప్తంగా 62.85 కోట్లు గ్రాస్, 41.07 కోట్లు షేర్ సాంధించింది.
మెగా కాంబినేషన్లో మూవీ కావడంతో ఆచార్య ప్రీ రిలీజ్ బిజినెస్ ఏకంగా రూ. 140 కోట్లు చేసింది. చిరంజీవి మూవీ ఇంకా 100 కోట్లు రాబట్టాల్సి ఉంది. వీకెండ్ లోనే సినిమా ఫ్లాప్ టాక్ తో సతమతమవుతుండగా వీక్ డేస్‌లో కలెక్షన్ మరింత తగ్గే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయ్. మిక్స్ డ్ టాక్ తెచ్చకున్న ఈ మూవీ బ్రేక్ ఈవెన్ మేరకు వసూళ్లను రాబడుతుందో లేదో తెలియాలంటే మరి కొద్ది రోజులు వేచిచూడాల్సిందే.