Movies' ఆచార్య‌ ' పై ఈ నెగిటివ్ బ‌జ్ ఎందుకొస్తోంది.. ఎవ‌రు...

‘ ఆచార్య‌ ‘ పై ఈ నెగిటివ్ బ‌జ్ ఎందుకొస్తోంది.. ఎవ‌రు చేస్తున్నారు ఇదంతా…!

మెగాస్టార్ చిరంజీవి – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన సినిమా ఆచార్య‌. ఈ సినిమా మూడేళ్ల నుంచి ఊరిస్తూ వ‌స్తూ ఎట్ట‌కేల‌కు ఈ నెల 29న థియేట‌ర్ల‌లోకి వ‌స్తోంది. ఈ సినిమాకు చాలా స్పెషాలిటీస్ ఉన్నాయి. చిరంజీవి హీరోగా చేసిన సైరా త‌ర్వాత మూడేళ్ల‌కు ఈ సినిమా వ‌స్తోంది. తొలిసారిగా తండ్రి కొడుకులు న‌టించిన ( గ‌తంలో మ‌గ‌ధీర‌, బ్రూస్‌లీ సినిమాల్లో చిరుది గెస్ట్ రోల్‌) సినిమా ఇది. చిరుకు జోడీగా గ‌తంలో చెర్రీ ప‌క్క‌న న‌టించిన కాజ‌ల్ ( ఆమె చిరుతో ఖైదీ నెంబ‌ర్ 150లో కూడా చేసింది), చ‌ర‌ణ్‌కు జోడీగా పూజా హెగ్డే న‌టిస్తున్నారు.

ఇక భ‌ర‌త్ అనే నేను త‌ర్వాత నాలుగేళ్ల లాంగ్ గ్యాప్ తీసుకుని కొర‌టాల శివ డైరెక్ట్ చేసిన సినిమా ఇది. ఇక క‌రోనా స‌మ‌యంలో సేవ‌ల ద్వారా దేశ‌వ్యాప్తంగా ఎంతో క్రేజ్ తెచ్చుకున్న సోనూసుద్ విల‌న్‌గా న‌టించాడు. ఇలా చాలా స్పెషాలిటీస్ ఈ సినిమాకు ఉన్నాయి. ఇటు మెగాభిమానులు కూడా ఆచార్య కోసం ఎంతో ఆతృత‌తో వెయిట్ చేస్తున్నారు.

ఇక రామ్‌చ‌ర‌ణ్ తాజాగా త్రిబుల్ ఆర్ సినిమాతో బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ అందుకుని ఫుల్ జోష్లో ఉన్నాడు. నెల‌న్న‌ర వ్య‌వ‌ధిలోనే చెర్రీ మ‌రోసారి ఆచార్య‌తో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు. ఇంత‌క‌న్నా మెగాభిమానుల్లో జోష్ ఏం ఉంటుంది. అన్నీ బాగున్నా ఓ బ్యాడ్ సెంటిమెంట్‌కు ఆచార్య‌కు లింక్ పెట్టి ఇప్పుడు కొంద‌రు ఆచార్య‌పై నెగిటివ్ బ‌జ్ క్రియేట్ చేస్తున్నారు. అదే రాజ‌మౌళి సెంటిమెంట్‌.

ఏ హీరో అయినా రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేస్తే.. అది సూప‌ర్ డూప‌ర్ బ్లాక్‌బ‌స్ట‌ర్ అవుతుంది. ఆ వెంట‌నే ఎంత పెద్ద డైరెక్ట‌ర్‌తో ఎంత మంచి అంచ‌నాల‌తో సినిమా చేసినా అది డిజాస్ట‌ర్ అవ్వ‌డం కామ‌న్ అయిపోయింది. రాజ‌మౌళి 12 సినిమాల‌ను చూస్తే ఆయ‌న ఏ హీరోతో సినిమా చేసినా హిట్టే..! ఇంకా చెప్పాలంటే రాజ‌మౌళి చేతిలో ప‌డిన హీరో ఆ సినిమాతో ఎంత పెద్ద హిట్ కొట్టినా.. ఆ త‌ర్వాత హిట్ కోసం క‌ళ్లు కాయ‌లు కాచేలా వెయిట్ చేయాల్సిన ప‌రిస్థితి.

ఇప్పుడు అదే సెంటిమెంట్ ఆచార్య‌కు వ‌ర్తిస్తుందా ? లేదా ఆచార్య ఆ బ్యాడ్ సెంటిమెంట్ రికార్డును బ్రేక్ చేస్తుందా ? అన్న‌దే చూడాలి. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు వ‌చ్చిన ఆచార్య గ్లింప్స్ – టీజ‌ర్ – ట్రైల‌ర్ – సాంగ్స్ అన్ని సినీ అభిమానుల‌ను విశేషంగా ఆక‌ట్టుకున్నాయి. ఇక సోమ‌వారం సాయంత్రం రిలీజ్ అయిన భ‌లే భ‌లే బంజారా సాంగ్ కూడా యావ‌రేజ్ అనిపించింది. ఈ సాంగ్‌లో చిరు, చెర్రీ క‌లిసి స్టెప్పులు వేయ‌బోతున్నారు.

కొణిదెల ఎంట‌ర్టైన్‌మెంట్‌, మ్యాట్నీ ఎంట‌ర్టైన్‌మెంట్ సంయుక్తంగా ఈ సినిమాను భారీ బ‌డ్జెట్‌తో నిర్మించాయి. చిరు చివ‌రి సినిమా సైరా న‌ర‌సింహారెడ్డి బ‌డ్జెట్‌తో పోలిస్తే అంచ‌నాలు అందుకోలేదు. అయితే ఆచార్య‌తో స‌త్తా చాటాల‌ని ఆయ‌న క‌సితో ఈ సినిమా కోసం క‌ష్ట‌ప‌డ్డారు. మ‌రి చిరు క‌ష్టం ఏమ‌వుతుందో ? ఈ నెల 29న తేలిపోనుంది.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news