అందాల రాశి.. రెండు దశాబ్దాల క్రితం కుర్రకారుకు ఆమె అందచందాలతో పిచ్చెక్కించేసేది. అప్పట్లో రాశి ఓ సినిమాలో ఉందంటే చాలు.. ఆమెను చూసేందుకు కుర్రకారు సినిమా థియేటర్లకు క్యూ కట్టేవారు. రాశి తన అందచందాలతోనే మాయ చేసేసేది. ఆమె అందం, ఫేస్, బాడీ చూస్తేనే ఏదో మాయలో పడిపోయేవారు. టాలీవుడ్‌లో ఎన్నో సినిమాల్లో నటించి పాపులర్ అయ్యింది. నటన కంటే అందం, కవ్వింపులతోనే ఈ భాయ ఇండస్ట్రీ జనాలను మాయలో పడేసుకుంది.
ఈ క్రమంలోనే ఆమెకు నందమూరి నటసింహం బాలకృష్ణ పక్కన బ్లాక్‌బస్టర్ హిట్ సమరసింహారెడ్డి సినిమాలో నటించే ఛాన్స్ వచ్చింది. బి. గోపాల్ దర్శకత్వంలో ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కిన ఈ సినిమా 1999 సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి తెలుగు సినిమా చరిత్రలో సువరాక్షరాలతో లిఖించదగ్గ సినిమాగా నిలిచిపోయింది. ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా సిమ్రాన్ – అంజలా ఝవేరి – సంఘవి ముగ్గురు హీరోయిన్లు నటించారు.
విజయేంద్ర ప్రసాద్ స్టోరీ అందించగా.. పరుచూరి బ్రదర్స్ సంభాషణలు అందించారు. మణిశర్మ బాణీలు ఊపేశాయి నాటి ఆంధ్రదేశాన్ని..! రూ.6 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం ఏకంగా రూ.16 కోట్ల షేర్ వసూలు చేసింది. ఈ సినిమా వచ్చి ఈ సంక్రాంతికి 23 సంవత్సరాలు పూర్తయ్యింది. ఆ రోజుల్లోనే 77 కేంద్రాల్లో 100 రోజులు ఆడడంతో పాటు 175 రోజులు, 200 రోజులు కూడా ఆడింది. ఈ సినిమాలో సిమ్రాన్ పోషించిన పాత్ర చాలా చిలిపిగా ఉంటుంది.
ఈ పాత్ర కోసం ముందుగా రాశిని సంప్రదించారట. అయితే కథ విన్నాక ఆమె నో చెప్పేసిందట. ఆమె ఈ సినిమాకు నో చెప్పడానికి ఒకే ఒక్క సీన్ కారణమైంది. ఈ విషయాన్ని ఆమే స్వయంగా చెప్పింది. ఈ సినిమాలో సీతాకోక చిలుక సీన్ ఉంటుంది. ఈ సీన్ మాస్ ప్రేక్షకులను థియేటర్లలో ఊపేసింది. ఆ సీన్ నచ్చలేదన్న కారణంతోనే రాశి ఇంత పెద్ద సినిమా వదులుకుంది. అయితే దర్శకుడు గోపాల్ సీన్‌ను మార్చాలని కోరినా రాజీపడలేదు.
చివరకు సిమ్రాన్‌కు కథ చెప్పగా ఆమె వెంటనే ఓకే చెప్పేసింది. మరో ఇద్దరు హీరోయిన్లుగా అంజలా ఝవేరి, సంఘవిని తీసుకున్నారు. కట్ చేస్తే సినిమా రిలీజ్‌కు ముందు ఎలాంటి అంచనాలు లేవు. రిలీజ్ అయ్యాక యేడాది పాటు ఆంధ్రదేశం అంతటా ఈ సినిమా మానియాలో మునిగి తేలింది. ఆ తర్వాత రాశీ ఓ బ్లాక్‌బస్టర్ హిట్ మిస్ అయిపోయానని చాలా ఫీలైందట.