Moviesమెగా హీరోల కూతుళ్ల‌కు ఏంటీ ఈ శాపం... అందుకే ఇలా జ‌రుగుతోందా...!

మెగా హీరోల కూతుళ్ల‌కు ఏంటీ ఈ శాపం… అందుకే ఇలా జ‌రుగుతోందా…!

టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీకి ఎలాంటి క్రేజ్ ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. నాలుగు ద‌శాబ్దాలుగా మెగా ఫ్యామిలీ మెయిన్ పిల్ల‌ర్‌లా పాతుకుపోయింది. నాడు చిరంజీవి పునాదిరాళ్లు సినిమాతో వేసిన బ‌ల‌మైన పునాది ఈ రోజు పెద్ద వృక్షంలా పాతుకుపోయింది. చిరంజీవి త‌ర్వాత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, నాగ‌బాబు.. ఈ త‌రంలో అల్లు అర్జున్‌, రామ్‌చ‌ర‌ణ్‌, వైష్ణ‌వ్ తేజ్‌, సాయితేజ్‌, వ‌రుణ్ తేజ్‌, క‌ళ్యాణ్ దేవ్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది హీరోలు అయిపోయారు. అస‌లు మెగా ఫ్యామిలీ అంటేనే ఇండ‌స్ట్రీలో స‌గం అన్న నానుడి వ‌చ్చేసింది. పైగా నాగ‌బాబు కుమార్తె నిహారిక కూడా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి మూడు, నాలుగు సినిమాలు చేసింది.

ఉదాహ‌ర‌ణ‌కు ఈ యేడాది చూసుకుంటేనే మెగా హీరోలు న‌టించిన భీమ్లానాయ‌క్ థియేట‌ర్ల‌లోకి వ‌చ్చేసింది. ఈ నెల‌లో గ‌ని, ఆచార్య ఉన్నాయి. గ‌తేడాది చివ‌ర్లో పుష్ప వ‌చ్చింది. అంటే నాలుగు నెలల్లో నలుగురు మెగా హీరోల సినిమాలు.. ఇక రిప‌బ్లిక్ కూడా వ‌చ్చింది. అస‌లు యేడాదిలో మెగా ఫ్యామిలీ హీరోల సినిమాలే స‌గ‌టున నెల‌కు ఒక‌టి అన్న‌ట్టుగా ఉన్నాయి. ఈ ఫ్యామిలీ గురించి ఎంత చెప్పుకున్నా త‌క్కువే. పేరుకు, సినిమాల‌కు, రికార్డుల‌కు కొద‌వ‌లేదు.

అయితే మెగా ఫ్యామిలీ హీరోల కూతుళ్లు.. ఆ ఇంట్లో ఆడ‌ప‌డుచుల‌ను ఏదో శాపం వెంటాడుతూ వ‌స్తోంద‌ని… అందుకే వారి జీవితాల్లో ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో వార్త‌ల్లో ఉంటున్నార‌న్న చ‌ర్చ‌లే వినిపిస్తున్నాయి. మెగాస్టార్ పెద్ద కుమార్తె సుస్మిత‌కు ముందు దివంగ‌త యంగ్ హీరో ఉద‌య్‌కిర‌న్‌తో పెళ్లి అనుకున్నారు. అట్ట‌హాసంగా ఎంగేజ్‌మెంట్ కూడా అయ్యింది. ఆ త‌ర్వాత పెళ్లి క్యాన్సిల్ అయ్యింది. ఆ త‌ర్వాత సుస్మిత‌ను చెన్నైకు చెందిన అబ్బాయితో పెళ్లి చేశారు. ఇప్పుడు ఈ బంధం కూడా విచ్ఛిన్న‌మైపోయింద‌నే అంటున్నారు.

పైగా సుస్మిత ఇప్పుడు చెన్నైలో భ‌ర్త‌కు దూరంగా హైద‌రాబాద్‌లో చిరుతోనే ఆ ఇంట్లోనే ఉంటోంది. ఇక చిరు రెండో కుమార్తె శ్రీజ ఫ్యామిలీ ఎప్పుడూ వివాదాల మ‌య‌మే. చిరు ఎంతో ఇష్టంగా పెంచ‌కున్న శ్రీజ ఇంట్లో చెప్ప‌కుండా శిరీష్ భ‌ర‌ద్వాజ్ అనే వ్య‌క్తిని పెళ్లి చేసుకుంది. చిరు పాలిటిక్స్‌లోకి రావ‌డానికి ముందు జ‌రిగిన ఈ పెళ్లితో చిరు మానసికంగా కుంగిపోయాడు. ఓ పాప పుట్టాక శిరీష్‌కు విడాకులు ఇచ్చేసింది. ఇప్పుడు క‌ళ్యాణ్‌దేవ్‌తో శ్రీజ‌కు రెండో పెళ్లి జ‌రిగింది. ఇప్పుడు ఈ దంప‌తుల‌కు కూడా ఓ పాప పుట్టాక వీరు కూడా విడిపోతున్నార‌నే అంటున్నారు.

ఇక నాగ‌బాబు కుమార్తె నిహారిక కూడా ప‌లు వెబ్‌సీరిస్‌ల‌తో పాటు సినిమాల్లో న‌టించి మంచి పేరు తెచ్చుకుంది. అటు ఢీ షోల‌తో కూడా పాపుల‌ర్ అయ్యింది. అయితే పెళ్ల‌య్యాక ఆమె ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటోంది. తాజాగా ఆమె ప‌బ్‌పై పోలీసులు జ‌రిపిన రైడింగుల్లో అడ్డంగా దొరికిపోయింది. ఇలా మెగా ఫ్యామిలీ ఆడ‌పడుచులు వివాదాల్లో చిక్కుకుని ఆ ఫ్యామిలీని ఇబ్బందుల్లోకి, వార్త‌ల్లోకి నెట్టేస్తున్నార‌న్న ఆందోళ‌న‌, ఆవేద‌న మెగాభిమానుల్లో కూడా ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news