బాలయ్య ఇప్పుడు మామూలు దూకుడుతో లేడు. బాలయ్య ఏం పట్టుకున్నా అది బంగారం అయిపోతోంది. అఖండ సినిమా బాలయ్య కాకుండా మరో హీరో చేసి ఉంటే ఆ బరువైన క్యారెక్టర్ ఆ హీరో చేయలేడు. సినిమా రిజల్ట్ వేరేగా ఉండేదనే చెప్పాలి. అసలు అఖండతో మళ్లీ తెలుగు సినిమాకు మామూలు ఊపు రాలేదు. అఖండ గర్జన ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రతి రోజు తెలుగు గడ్డమీద… అటు కర్నాకట లాంటి చోట్ల కూడా వీధుల్లో అఖండ సినిమాను తెరమీద వేయడం.. జనాలు తండోప తండాలుగా చూడడం జరుగుతూనే ఉంటోంది.
ఇక ఇప్పుడు మలినేని గోపీచంద్ డైరెక్షన్‌లో బాలయ్య చేస్తోన్న సినిమాపై సైతం భారీ భారీ అంచనాలే ఏర్పడ్డాయి. అటు అన్‌స్టాపబుల్ షో ఫస్ట్ సీజన్ బ్లాక్‌బస్టర్ అయ్యింది. ఇప్పుడు అందరూ అన్‌స్టాపబుల్ సెకండ్ సీజన్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ సెకండ్ సీజన్లోనే చిరంజీవి, వెంకటేష్ లాంటి స్టార్ హీరోలు వచ్చే ఛాన్సులు ఉన్నాయి. మలినేని గోపీచంద్ తర్వాత కూడా బాలయ్య లైనప్ స్ట్రాంగ్‌గానే ఉంది.
అనిల్ రావిపూడి సినిమా సెప్టెంబర్ లేదా అక్టోబర్ నుంచి సెట్స్ మీదకు వెళుతుంది. బాలయ్య కెరీర్‌లో చాలా సినిమాలే ఉన్నాయి. కొన్ని క్రేజీ ప్రాజెక్టులు బాలయ్యతోనే తీయాలని అనుకున్నా అవి పట్టాలు ఎక్కలేదు. కొన్ని మధ్యలో ఆగిపోయినవీ ఉన్నాయి. కోడి రామకృష్ణ – బాలయ్య కాంబోలో విక్రమసింహా భూపతి సగం షూటింగ్ అయ్యాక మధ్యలోనే ఆగిపోయింది.
ఇక బాలయ్య స్వీయ దర్శకత్వంలో ప్రారంభమైన నర్తనశాల సినిమా మహానటి సౌందర్య మరణంతో మధ్యలోనే ఆగిపోయింది. ఈ క్రమంలోనే సంచలన దర్శకుడు తేజ కూడా బాలయ్యతో రైతు అనే టైటిల్‌తో ఓ సినిమా అనుకున్నారు. ఈ కథను కేవలం స్టార్స్‌తోనే తీయాలని ఆయన ముందు నుంచి బలంగా ఫిక్స్ అయ్యారు. ముందు రజనీకాంత్‌తో చర్చలు జరిపినా వర్కవుట్ కాలేదు. తర్వాత బాలయ్య కూడా తేజ మదిలో మెదిలారు.
రైతు సమస్యలపై పోరాటం చేసే నాయకుడి పాత్రలో హీరో కనిపిస్తాడు. ఈ కథకు బాలయ్య లాంటి మాస్ అప్పీల్ ఉన్న హీరో అయితే బాగుంటుందనే తేజ అనుకున్నారు. ఆయన నటిస్తేనే తన కథ బలంగా ప్రేక్షకులకు రీచ్ అవుతుందని తేజ భావించారు. అంతకుముందే హరికృష్ణ కూడా రైతు సమస్యలపై టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్ లాంటి సినిమాలు చేశారు. అయితే ఆ తర్వాత తేజకు వరుస ప్లాపులు రావడంతో ఈ ప్రాజెక్టును ఆయనే పట్టాలు ఎక్కించలేదు.
బాలయ్య ఓ దర్శకుడిని నమ్మితే.. అతడు ఎన్ని ప్లాపుల్లో ఉన్నా కూడా సినిమా చేసేస్తాడు. అయితే తేజయే ఈ సినిమా విషయంలో ధైర్యం చేయలేదు. ఆ తర్వాత కూడా తేజ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బాలయ్యతో సినిమా చేయడం ఈజీ అని.. ఆయన్ను మనం ఎలాగైనా మౌల్డ్ చేసుకోవచ్చని అంటూనే చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్ లాంటి వాళ్లతో మనం సినిమాలు చేయలేం అనడం కొసమెరుపు. ఏదేమైనా బాలయ్యతో సినిమా చేయాలన్న కోరిక అయితే తేజకు బలంగా ఉంది. భవిష్యత్తులో అయినా వీరి కాంబోలో రైతు కథ తెరమీదకు వస్తుందేమో ? చూడాలి.