టాలీవుడ్ యంగ్‌టైగర్ ఎన్టీఆర్ – రాజమౌళి, వినాయక్ కాంబినేషన్ అంటే ప్రేక్షకుల్లో తిరుగులేని క్రేజ్ ఉంటుంది. ఎన్టీఆర్ – వినాయక్ కాంబోలో ఆది, సాంబ, అదుర్స్ మూడు సినిమాలు వచ్చి మూడు ప్రేక్షకులను మెప్పించాయి. ఇక ఎన్టీఆర్ – రాజమౌళి కాంబినేషన్‌లో స్టూడెంట్ నెంబర్ 1 – సింహాద్రి – యమదొంగ – తాజాగా త్రిబుల్ ఆర్ సినిమాలు వచ్చాయి. తాజాగా వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమా ఏకంగా రు. 1100 కోట్ల వసూళ్లు దాటేసింది. ఈ సినిమాతో ఎన్టీఆర్‌కు పాన్ ఇండియా ఇమేజ్ వచ్చింది.
త్రిబుల్ ఆర్ సక్సెస్ ఎంజాయ్ చేస్తోన్న రాజమౌళి నెక్ట్స్ మహేష్‌బాబుతో హాలీవుడ్ రేంజ్ సినిమా తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. ఆఫ్రికా అడవుల నేపథ్యంలో అడ్వెంచర్ థ్రిల్లర్‌గా ఈ సినిమా తెరకెక్కనుంది. ఇక ఎన్టీఆర్ కొరటాల శివ సినిమాకు రెడీ అవుతున్నాడు. ఇదిలా ఉంటే రాజమౌళి గతంలో మాట్లాడిన మాటల వీడియో ఒకటి ఇప్పుడు జోరుగా వైరల్ అవుతోంది.
బాహుబలి 2 సమయంలో రాజమౌళి మాట్లాడుతూ తన నెక్ట్స్ సినిమాగా గరుడ అనే ప్రాజెక్ట్ ఉంటుందని… నెక్ట్స్ ప్రాజెక్టుగా ఇదే ఉంటుందని చెప్పాడు. ఈ సినిమాకు సంబంధించిన లైన్ ఒకటి తన మైండ్‌లో ఎప్పుడూ రన్ అవుతూనే ఉందని కూడా అన్నాడు. ఎన్టీఆర్ హీరోగా భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కుతుందన్న క్లారిటీ కూడా రాజమౌళి ఇచ్చేశాడు.
రాజమౌళి తనకు నచ్చిన హీరో జూనియర్ ఎన్టీఆరే అన్న విషయాన్ని చాలా సార్లు ప్రత్యక్షంగానో, పరోక్షంగానే బయట పెట్టారు. ప్రభాస్‌కు బాహుబలి లాంటి సినిమా ఇచ్చాక రాజమౌళికి ఎన్టీఆర్ అభిమానుల నుంచి కూడా తమ హీరోకు అలాంటి సినిమా ఎప్పుడు ఇస్తారన్న ప్రశ్నలు చాలానే వచ్చాయి. ఆ టైంలోనే రాజమౌళి గరుడ సినిమా గురించి చెప్పాడు.
అయితే బాహుబలి 2 తర్వాత రాజమౌళి గరుడ ప్రాజెక్టు చేయకపోయినా ఎన్టీఆర్‌తోనే త్రిబుల్ ఆర్ సినిమా చేశాడు. అయితే ఆ సినిమాలో రామ్‌చరణ్ కూడా మరో హీరోగా ఉండడం.. ఓవరాల్‌గా సినిమాలో ఎన్టీఆర్‌కు కాస్త ప్రాధాన్యత తగ్గినట్టుగా ఎన్టీఆర్ అభిమానులు ఫీలవ్వడంపై ఎక్కువ ప్రచారం జరిగింది. అందుకే ఇప్పుడు ఎన్టీఆర్ హీరోగా గరుడ సినిమాను ఎప్పుడు పట్టాలెక్కిస్తావ్ జక్కన్న అన్న ప్రశ్నలు ఎన్టీఆర్ అభిమానుల నుంచే ఎక్కువుగా వస్తున్నాయి.
రాజమౌళి లెక్కలు వేరేగా ఉన్నాయి. ప్రస్తుతం మహేష్‌తో చేసే సినిమా ఎలా లేదన్నా రెండేళ్లు పడుతుంది. ఆ తర్వాత గరుడ ఉంటుందా ? బన్నీతో ఉంటుందా ? లేదా తన జీవిత కాల డ్రీమ్ ప్రాజెక్టు అయిన మహాభారతం ఉంటుందా ? అన్నది అప్పుడే తెలియదు. మహాభారతాన్ని కనీసం ఆరేడు భాగాలుగా తెరకెక్కించాల్సి ఉంటుందని కూడా రాజమౌళి చెప్పిన సంగతి తెలిసిందే.