కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ నటించిన బీస్ట్ సినిమా ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విజయ్ నటించిన మాస్టర్ సినిమా తర్వాత భారీ అంచానలతో బీస్ట్ తెరకెక్కింది. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించడంతో పాటు అనిరుధ్ మ్యూజిక్, అరబిక్ కుత్తు సాంగ్ ఇవన్నీ సినిమాపై రిలీజ్‌కు ముందే అంచనాలు పెంచేశాయి.
దీనికి తోడు తెలుగులో ఈ సినిమాను దిల్ రాజు కొని రిలీజ్ చేశారు. తెలుగులోనే ఈ సినిమాకు రు. 10 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా రు. 120 కోట్ల బిజినెస్‌తో ఈ సినిమా రంగంలోకి దిగింది. ఈ రోజు ఇప్పటికే పలు చోట్ల ఓవర్సీస్ ప్రీమియర్లు కంప్లీట్ అయ్యాయి. సినిమా ఫస్టాఫ్ విషయానికి వస్తే
ఫస్ట్ హాఫ్ పర్వాలేదనిపించింది. హలమితి హబీబో పాట అయితే కన్నుల పండుగగా ఉంది. విజయ్ తనదైన స్టైల్ యాక్టింగ్‌తో పాటు కామెడీ సీన్లు బాగున్నాయి. హీరోయిన్ పూజా హెగ్డే అందంగా ఉంటుంది. ఐఎస్ఐ వాళ్లు మాల్‌ను హైజాక్ చేసే సీన్లు బలహీనంగా ఉన్నాయి.
అయితే సెకండాఫ్‌లో కామెడీ ఉన్నా బలహీనమైన కథాంశంతో ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టింది. సినిమా చూసిన ఓవర్సీస్ ప్రేక్షకులు అయితే ఇదో స్టుఫిడ్ ఫిల్మ్ అని కామెంట్ చేస్తున్నారు. ఇది అప్పుడప్పుడు గ్యాలరీల్లో ప్రదర్శించబడుతుందని.. విజయ్ అభిమానులకు ఈ సినిమాను భరిస్తారేమోగాని.. మిగిలిన ప్రేక్షకులు ఈ సినిమా చూసి పెదవి విరవడం ఖాయం అంటున్నారు.
సినిమాపై ఉన్న భారీ హైప్‌తో పోలిస్తే ఏ మాత్రం అంచనాలు అందుకోలేదు. ఇది ఓ ఆర్ట్ గ్యాలరీ సినిమా అన్న జోకులు కూడా పేలుతున్నాయి. ఇక ఈ సినిమాలో ప్లస్‌ల విషయానికి వస్తే అనిరుధ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో పాటు విజయ్ స్టైలీష్ యాక్టింగ్ , అరబిక్ కుత్తు సాంగ్ బాగున్నాయి. ఇక మైనస్‌ల విషయానికి వస్తే హీరోయిన్ పాత్ర సరిగా డిజైన్ చేసుకోకపోవడం, బందీలుగా ఉన్నప్పుడు కూడా చికాకు కలిగించిన కామెడీ, స్టుపీడ్ ప్లాట్ ఇవన్నీ మైనస్‌లుగా ఉన్నాయి. ఓవరాల్‌గా చూస్తే సినిమా అంచనాలు అందుకోలేదు. ఇక ఏపీ, తెలంగాణలో ఈ సినిమాను భారీ రేట్లకు కొన్నారు. అయినా కూడా ఇక్కడ బుకింగ్స్ చాలా పూర్‌గా ఉన్నాయి.