కోలీవుడ్ స్టార్ హీరోలు, యంగ్ హీరోలకు తెలుగులో మంచి మార్కెట్ ఉంది. అయితే ఇది ఇప్పటి నుంచే కాదు పాత తరం హీరోలు అయిన కమల్‌హాసన్, రజనీకాంత్ ఉన్నప్పటి నుంచే కోలీవుడ్ హీరోల సినిమాలకు తెలుగులో మంచి మార్కెట్ ఉండేది. కమల్, రజనీ సినిమాలు అయితే తెలుగులో స్టార్ హీరోల సినిమాలతో సమానంగా పోటీ పడి మరీ వసూళ్లు రాబట్టేవి. దాదాపు 30 – 35 ఏళ్ల నుంచే కోలీవుడ్ హీరోల సినిమాలు తెలుగులో హిట్ అయ్యి భారీ వసూళ్లు రాబట్టడం అనే ట్రెండ్ నడుస్తూ ఉంది.
ఆ తర్వాత వచ్చిన కోలీవుడ్ హీరోలు సూర్య, కార్తీ, విశాల్, మాధవన్, సిద్ధార్థ్ లాంటి వాళ్లు కూడా టాలీవుడ్‌లో ఓ మార్కెట్ పదిల పరచుకున్నారు. అయితే మిగిలిన హీరోలతో పోలిస్తే కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఈ విషయంలో కాస్త వెనకపడే ఉండేవారు. అయితే తుపాకీ తర్వాత తన ప్రతి సినిమా తెలుగులో విడుదలయ్యేలా చేస్తూ ఇక్కడ కూడా తన ఫాలోవర్స్‌ను, మార్కెట్‌ను పెంచుకుంటూ వస్తున్నాడు.
విజయ్ సర్కార్, మాస్టర్, అదిరింది లాంటి సినిమాలు తెలుగులో కూడా మంచి ప్రి రిలీజ్ బిజినెస్ చేసి అంచనాలు రేకెత్తించాయి. ఈ క్రమంలోనే విజయ్ తాజా చిత్రం బీస్ట్. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా ఓ షాపింగ్ మాల్లో ఉగ్రవాదులు చొరబడి అక్కడ ఉన్న ప్రజలను కిడ్నాప్ చేసి తమ డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్లు పెడతారు.
అయితే అదే షాపింగ్ మాల్లో ఉన్న హీరో విజయ్ ఏం మ్యాజిక్ చేశాడు ? అన్న కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. ట్రైలర్ అయితే ఆసక్తిగానే ఉంది. ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో రు. 10 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ చేసింది. నైజాంలో రూ.3.5 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లో రూ.4.40 కోట్లు, సీడెడ్‌లో రూ.2.1 కోట్లకు అమ్ముడు పోయిందని సమాచారం. ఏపీ, తెలంగాణలో ఈ సినిమా 505 థియేటర్లలో రిలీజ్ అవుతోంది.
ఓవరాల్‌గా బ్రేక్ ఈవెన్ పాయింట్ రు 10.50 కోట్లుగా ఫిక్స్ చేశారు. విజయ్ చివరి సినిమా మాస్టర్‌ను తెలుగులో రు. 4 కోట్లకు కొన్నారు. ఈ సినిమాకు ఇప్పుడు మాస్టర్‌తో పోలిస్తే రు. 6 కోట్లు అదనంగా బిజినెస్ పెరిగింది. ఇక వరల్డ్ వైడ్‌గా బీస్ట్ కు రు. 120 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు చెబుతున్నారు. సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ అవుతోంది.