మెగా ప్రిన్స్ వరుణ్‌తేజ్ నటించిన గని సినిమా ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గద్దలకొండ గణేష్, ఎఫ్ 2 లాంటి హిట్లతో జోరుమీదున్న వరుణ్‌తేజ్ ఈ నెలలోనే గనితో పాటు ఎఫ్ 3 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ రోజు గనితో తన అదృష్టం పరీక్షించుకున్నాడు. ఓవర్సీస్ ప్రీమియర్ షో టాక్ ప్రకారం గని ఎలా ఉందో చూద్దాం.
విక్రమాదిత్య 2004 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ గెలుచుకుంటాడు. అయితే స్టెరాయిడ్ల వాడకం ఆరోపణలతో అతడిని నిర్వాహకులు జాతీయ ఛాంపియన్ షిఫ్‌లో పాల్గొనకుండా నిషేధం విధిస్తాడు. అయితే అతడి కొడుకు గని సమాజానికి ఓ పాయింట్ చూపించేందుకే బాక్సార్‌గా మారతాడు. అతడు బాక్సింగ్‌లో పాల్గొనకూడదని తల్లి కండీషన్ పెట్టినా.. ఆమె తెలియకుండానే అతడు ఎలా ఛాంపియన్ అయ్యాడు ? ఈ ప్రయత్నంలో అతడికి ఎదురైన సవాళ్లు ఏంటన్నదే ఈ సినిమా స్టోరీ.
గని ఓ మామూలు రివేంజ్ స్పోర్ట్స్ డ్రామా. స్పోర్ట్స్ డ్రామాకు కుటుంబ నేపథ్యాన్ని, సెంటిమెంట్‌ను జోడించడం ద్వారా ఈ సినిమాను తెరకెక్కించారు. ఇక భారతీయ క్రీడల్లో ఉన్న బెట్టింగ్ అంశాన్ని కూడా సినిమాలో ఇరికించారు. గనికి ప్రేమతో పాటు పగ కూడా ఉంటుంది. అయితే బలమైన కథ ఉన్నా కథనం పరంగా చూస్తే సినిమాకు పాక్షికంగా మాత్రమే న్యాయం జరిగిందని ప్రీమియర్ షో రిపోర్టులు చెపుతున్నాయి. వరుణ్ తేజ్ తనకు బాగా నటించాడు.
సినిమా ఫస్టాఫ్ బోరింగ్‌గా ఉంటే.. సెకండాఫ్ బాగా ఆకర్షణీయంగా ఉందని అంటున్నారు. బెట్టింగ్ సిండికేట్, ఓ బాధిత కుటుంబం పోరాటం, క్రీడల్లో టాలెంట్‌కు జరుగుతున్న అన్యాయం లాంటి మంచి అంశాలు ఈ సినిమాలో ఉన్నాయి. అయితే డైరెక్టర్ టేకింగ్ పరంగా అంచనాలు అందుకోలేదు. ఓవరాల్‌గా గద్దలకొండ గణేష్ రేంజ్ సినిమా అయితే ఇది కాదు.
ప్లస్ పాయింట్స్ ( + )
– బాక్సర్‌గా వరుణ్‌తేజ్ పాత్ర
– అల్లు బాబి నిర్మాణ విలువలు
– గుడ్ సెకండాఫ్
మైనస్ పాయింట్స్ ( – )
– ఫస్టాఫ్‌లో బోరింగ్ సీన్లు
– ఎమోషనల్ సీన్లు తేలిపోవడం
– అంచనాలు అందుకోలేని మ్యూజిక్
– కొన్ని రొటీన్ సీన్లు