టాలీవుడ్‌లో దివంగత లెజెండ్రీ హీరో అక్కినేని నాగేశ్వరరావు వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు నాగార్జున. అమ్మాయిల కలల రాకుమారుడు మన్మథుడిగా, ఆ తర్వాత కింగ్‌గా అభిమానులను అలరిస్తూ వస్తున్నాడు. ఇప్పుడు నాగ్ ఇద్దరు తనయులు చైతు, అఖిల్ ఇద్దరూ కూడా హీరోలుగా నిలదొక్కుకున్నారు. నాగార్జున కెరీర్‌లో ఎన్ని హిట్ సినిమాలు ఉన్నా కూడా అన్నమయ్య సినిమాకు ఎప్పటకీ ఆ క్రేజ్ అలా ఉండిపోతుంది.
అన్నమయ్య నాగార్జున ఇలాంటి పాత్రలు కూడా చేస్తాడా ? అని సినీ అభిమానులు నోరెళ్ల పెట్టేలా చేసింది. తిరుమల వెంకటేశ్వరస్వామి భక్తుడిగా అన్నమయ్య జీవించేశారనే చెప్పాలి. అన్నమయ్య నాగార్జునను అటు ఫ్యామిలీ, ఇటు క్లాస్ ఆడియెన్స్‌కు మరింత దగ్గర చేసింది. అంతకు ముందే నాగార్జున – రాఘవేంద్రరావు కాంబినేషన్లో ఎన్నో సినిమాలు వచ్చాయి. ఆ సినిమాలకు భిన్నంగా భక్తిరస ప్రధాన పాత్రలో అన్నమయ్య సినిమాను ఎనౌన్స్ చేసినప్పుడు చాలా మంది ఇండస్ట్రీ వాళ్లు షాక్ అయ్యారు.
అప్పటికే నిన్నే పెళ్లాడతా లాంటి లవ్ స్టోరీ చేసి. రొమాంటిక్ ఇమేజ్‌తో ఉన్న నాగార్జునను భక్తిరస పాత్రలో ప్రేక్షకులు ఎలా ? ఊహించుకుంటారో ? అన్న డౌట్లు చాలా మందికి వచ్చాయి. అయితే 1997లో రిలీజ్ అయిన అన్నమయ్య సినిమా ఆంధ్ర దేశాన్ని భక్తిభావంతో ఊర్రూత లూగించేసింది. ఈ సినిమాలో వెంకటేశ్వర స్వామి పాత్ర కోసం సుమన్‌ను తీసుకున్నారు. సుమన్ వెంకటేశ్వర స్వామిగా అలా ఒదిగిపోయారు.
వెంకటేశ్వరుడి భక్తుడు అన్నమయ్యగా నాగార్జున ఎంతలా ఒదిగిపోయారో.. ఆ పాత్రకు పోటీగా వెంకటేశ్వరస్వామిగా సుమన్ కూడా అంతే పోటీగా నటించారు. అయితే ఈ పాత్ర సుమన్ చేయాల్సింది కాదట. అప్పటికే నాగార్జున స్టార్ హీరోల లిస్టులో ఉన్నారు. వెంకటేశ్వరుడి భక్తుడిగా నాగ్ ఆయన పాదాలపై పడే సీన్లు ఉంటాయి. ఈ సీన్లు సినిమాలో చాలానే ఉంటాయి. అందుకే వెంకటేశ్వర స్వామి పాత్ర కోసం ముందుగా సీనియర్ హీరో శోభన్‌బాబును అడిగారట దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు.
అయితే అప్పటికే ఆయన సినిమాలకు దూరమైపోయారు. ఈ ఆఫర్‌ను కాదనలేక ఆయన రు. 50 లక్షలు డిమాండ్ చేశారట. అంత రెమ్యునరేషన్ కాదనలేక శోభన్‌బాబును పక్కన పెట్టి… ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి పాత్ర కోసం బాలయ్యను సంప్రదించారట. అయితే ఇద్దరు స్టార్ హీరోలు అలాంటి పాత్రల్లో కనిపిస్తే.. ఫ్యాన్స్ రిసీవింగ్ ఎలా ఉంటుందో ? అన్న సందేహంతో మళ్లీ రాఘవేంద్రరావే వెనక్కు తగ్గారట.
చివరకు సుమన్ అయితే బాగుంటుందని భావించి.. సుమన్‌ను పిలిపించి కథ చెప్పడంతో పాటు ఫొటో షూట్ కూడా చేశారట. అప్పుడు సుమన్ ఫర్‌ఫెక్ట్‌గా సెట్ అవుతాడని భావించి.. సుమన్‌ను ఆ పాత్రకు ఎంపిక చేశారట. అలా సుమన్ వెంకటేశ్వర స్వామిగా అదరగొట్టే నటనతో సినిమా విజయంలో తన వంతు పాత్ర పోషించారు. ఆ పాత్ర ఎప్పటకీ అలా చెక్కు చెదరకుండా నిలిచిపోయింది.