గత కొంత కాలంగా టాలీవుడ్‌లో ఏదో ఒక విషాదం చోటు చేసుకుంటోంది. ఈ పరంపరలోనే సీనియర్ డైరెక్టర్ శరత్ ఈ రోజు మృతి చెందారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతోన్న ఆయన ఈ రోజు ఉదయం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యం తీసుకుంటూ ఈ రోజు మృతిచెందారు. ఆయన మృతిపట్ల ఇండస్ట్రీకి చెందిన పలువురు సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని సోషల్ మీడియా సందేశాల్లో పేర్కొన్నారు.
శరత్ తెలుగులో 20కు పైగా సినిమాలకు దర్శకత్వం వహించారు. ఆయన సినిమాల్లో చాలా వరకు బాక్సాఫీస్ దగ్గర విజయం సాధించాయి. ఫ్యామిలీ కథా చిత్రాలకు ఆయన కేరాఫ్‌గా ఉండేవారు. ఇక చదస్తపు మొగుడు అనే సినిమాతో ఆయన డైరెక్టర్‌గా వెండితెరకు పరిచయం అయ్యాడు. అయితే నందమూరి నటసింహం బాలకృష్ణ – శరత్ కాంబినేషన్లో మంచి సినిమాలు వచ్చాయి.
శరత్ డైరెక్షన్ లో బాలకృష్ణ హీరోగా నటించిన వంశానికొక్కడు, పెద్దన్నయ్య, సుల్తాన్ సినిమాలు హిట్ అవ్వడంతో పాటు అటు శరత్‌కు, ఇటు బాలయ్యకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఇక సుమన్‌తో కూడా ఆయన ఎక్కువ సినిమాలు చేశారు. చాదస్తపు మొగుడు – పెద్దింటి అల్లుడు – బావబావమరిది – చిన్నల్లుడు సినిమాలు శరత్ తెరకెక్కించినవే..!