ఏ రంగంలో అయినా బంధుత్వాలు మామూలే. సినిమా, రాజకీయ రంగాల్లో ఉండే బంధుత్వాలు చాలా ఇంట్రస్టింగ్‌గా ఉంటాయి. ఇక మన దేశంలో సినిమా, రాజకీయ రంగాల్లో వారసత్వాలు, బంధుత్వాలు కామన్. మన తెలుగు సినిమా రంగంలో మూడో తరంలోనూ బంధుత్వాలు నడుస్తూనే ఉన్నాయి. ఒకే కుటుంబం నుంచి సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చి హీరోలు, ఇతర విభాగాల్లో కొనసాగుతోన్న వారికి గురించి ప్రేక్షకులకు చాలా తక్కువ మందికే తెలుసు.
చోటా కె. నాయుడు – సందీప్ కిషన్ :
టాలీవుడ్లో ఫేమస్ సినిమాటోగ్రాఫర్ చోటా కె. నాయుడు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. చాలా టాప్ హీరోలే ఆయనతో కలసి పని చేసేందుకు ఆసక్తి చూపిస్తారు. చోటా కె. నాయుడకు సందీప్ కిషన్ సొంత మేనళ్లుడు అవుతాడు. మేనళ్లుడు సందీప్ కెరీర్ కోసం చోటా కె. నాయుడు తన వంతుగా సాయం చేస్తూనే ఉంటారు.
రేఖ – సావిత్రి :
అలనాటి తమిళ మేటి నటుడు జెమినీ గణేషన్ రెండో భార్య సావిత్రి. అయితే మొదటి భార్య పుష్పవల్లి కుమార్తె అలనాటి బాలీవుడ్ మేటి నటి రేఖ. వీరిద్దరు వరుసకు తళ్లి కూతుళ్లు అవుతారు. పుష్పవల్లి చిత్తూరు జిల్లాకు చెందిన వారు.
గోపీచంద్ – శ్రీకాంత్ :
టాలీవుడ్ సీనియర్ హీరో శ్రీకాంత్… యంగ్ హీరో గోపీచంద్ ఇద్దరూ బంధువులే అవుతారు. శ్రీకాంత్ సొంత అక్క కుమార్తెనే గోపీచంద్ పెళ్లి చేసుకున్నారు. అలా శ్రీకాంత్ సొంత మేనకోడలి భర్తే గోపీచంద్ అవుతారు.
కమల్‌హాసన్ – సుహాసిని :
విశ్వనటుడు కమల్‌హాసన్, సీనియర్ నటి సుహాసిని బాబాయ్, అమ్మాయ్ అవుతారు. కమల్‌హాసన్ సోదరుడు చారుహాసన్ కుమార్తె సుహాసిని. ఇక శృతీహాసన్, అక్షరహాసన్ కూడా సుహాసినికి కజిన్ సిస్టర్స్ అవుతారు. సుహాసిని లెజెండరీ డైరెక్టర్ మణిరత్నంను పెళ్లాడిన సంగతి తెలిసిందే.
కె. విశ్వనాథ్ – చంద్రమోహన్ :
కళాతపస్వి లెజెండ్రీ డైరెక్టర్ అయిన కె. విశ్వనాథ్, సీనియర్ నటుడు చంద్రమోహన్ కజిన్స్ అవుతారు. అందుకే విశ్వనాథ్ తన సినిమాల్లో చంద్రమోహన్‌ను ఎంకరేజ్ చేసేవారు.
జయసుధ – విజయనిర్మల:
అలనాటి మేటినటి విజయనిర్మల మేనకోడలే జయసుధ. విజయనిర్మల పెద్దమ్మ కుమారుడి కూతురే జయసుధ అలియాస్ సుజాత. ఆమె విజయనిర్మల ప్రోత్సాహంతోనే స్టార్ నటిగా ఎదిగారు.
శ్రీదేవి – మహేశ్వరి :
అలనాటి అతిలోక సుందరి శ్రీదేవి, హీరోయిన్ మహేశ్వరి కజిన్ సిస్టర్స్ అవుతారు.
ఏఆర్. రెహ్మన్ – జీవీ ప్రకాష్‌కుమార్ :
మేటి సంగీత దిగ్గజం ఏఆర్. రెహ్మన్ సొంత అక్కడ కొడుకే జీవీ ప్రకాష్‌కుమార్. అంటే రెహ్మన్‌కు సొంత మేనళ్లుడు అవుతాడు.
విజయ్ కుమార్ – అరుణ్ విజయ్ :
సాహో సినిమాలో పవర్ ఫుల్ విలన్‌గా మెప్పించిన అరుణ్ విజయ్.. సీనియర్ నటుడు విజయ్ చందర్ మొదటి భార్య కుమారుడు. విజయ్ చందర్ మొదటి భార్య చనిపోయాక అలనాటి మేటి నటి మంజులను పెళ్లాడాడు. మంజులకు ముగ్గురు కూతుళ్లు.
ప్రియమణి – విద్యాబాలన్ :
బాలీవుడ్లో అసమాన ప్రతిభ కనపరిచిన విద్యాబాలన్, సౌత్‌లో ఓ వెలుగు వెలిగిన ప్రియమణి బంధువులు అవుతారు. వీరు కజిన్స్ అవుతారు. ప్రముఖ గాయని మాల్గుడి శుభకు ప్రియమణి మేనకోడలు అవుతుంది.
రామ్ – శర్వానంద్ :
టాలీవుడ్లో ఇద్దరు యంగ్ క్రేజీ హీరోలుగా ఉన్నారు రామ్, శర్వానంద్. రామ్ పోతినేనికి శర్వానంద్ వరుసకు బావ అవుతాడు. రామ్ అక్క, శర్వానంద్ అన్న ఇద్దరు భార్య, భర్తలు.
షబానీ అజ్మీ – టబు :
ఒకప్పటి బాలీవుడ్ నటి షబనా అజ్మీ అన్న కూతురు టబు.. ఇక టబు అక్క ఫరాహ్ కూడా నటి అన్న సంగతి తెలిసిందే.
ప్రకాష్ రాజ్ – శ్రీహరి :
విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్, శ్రీహరి ఇద్దరూ సొంత తోడళ్లుల్లు. శ్రీహరి భార్య డిస్కోశాంతి సోదరి ప్రకాష్‌రాజ్‌కు ముందు భార్య. ఆ తర్వాత ఆమెకు విడాకులు ఇచ్చిన ప్రకాష్‌రాజ్ పోనీవర్మను పెళ్లాడాడు.