బాలీవుడ్ అయినా… టాలీవుడ్ అయినా, కోలీవుడ్,శాండిల్ వుడ్ ఇండస్ట్రీ ఏదైనా చిత్ర సీమలో ఆర్టిస్టులకు టేక్ అప్ లు…. బ్రేక్ అప్‌లు చిటికేస్తే జరిగేవే. నచ్చితే కలిసి తిరగడం అభిప్రాయ భేదాలు తలెత్తితే బ్రేక్ చెప్పుకోవడం సర్వసాధారణమే. సినిమాలో హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ చాలా కీలకం అయితే ఈ క్రమంలో వీరిపై కొన్ని పుకార్లు వస్తుంటాయి అన్నది కొందరి వాదన. అయితే ఇండస్ట్రీలో విడిపోయిన ప్రేమ జంటలను చూస్తే టేకప్స్ ఎంత ఫాస్ట్ గా జరుగుతాయో బ్రేకప్స్ కూడా అంతే ఫాస్ట్ గా జరిగిపోతాయి అన్నది నిజమే.
చాలమంది హీరో, హీరోయిన్లు… సెలబ్రిటీలు చెట్టాపట్టాలేసుకుని తిరిగారంటూ సోషల్ మీడియాలో హల్ చల్ చేసిన వారికి సంబంధించిన ఫోటోలు, వీడియోలే అందుకు సాక్ష్యాలు. అయితే అంతా బాగుంది అనుకునేలోపు చాలా జంటలు బ్రేకప్ చెప్పుకుని తూచ్ అనేస్తాయి. ఇలాంటి వార్తలు చాలానే విన్నాం. అయితే ఇపుడు అలాంటి సెలబ్రిటీల్లో సోషల్ మీడియాలో సెన్సేషనల్ సృష్టించిన కొందరిని చూద్దాం. వీరి గురించి స్ప్రెడ్ అయిన వార్తలు ఏంటో తెలుసుకుందాం.
రెజీనా కసాండ్రా తెలుగులో గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ అందరూ ఈమె టాప్ పొజిషన్ కి వెళుతుందని ఎక్స్పెక్ట్ చేశారు… కట్ చేస్తే అమ్మడు బాగా డీలా పడిపోయింది. దానికి కారణం మెగా హీరో సాయి ధరమ్ తేజ్ అని టాక్. వీరిద్దరూ కలసి సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సినిమా సమయంలో ప్రేమలో పడ్డారని… ఆ తర్వాత ఆ రిలేషన్ అలాగే కొనసాగిందని… ఆ తరవాత ఈ కారణంగానే రెజీనాకు తెలుగులో అవకాశాలు కనుమరుగయ్యాయని అప్పట్లో వార్తలు వినిపించాయి. అయితే ఆ తరవాత మళ్లీ విడిపోయారని అని కూడా వార్తలు వినిపించాయి.
ఇక ఇదే తరహాలో సీనియర్ హీరో తరుణ్… క్రేజీ హీరోయిన్ ఆర్తి అగర్వాల్ మధ్య ప్రేమాయణం ముగియడం అప్పట్లో సెన్షేషనల్. తరుణ్ అమ్మ రోజా రమణికి ఇష్టం లేకపోవడంతో ఆర్తీకి బ్రేక్ అప్ చెప్పాడని దాంతో ఆర్తీ డిప్రెషన్ లోకి వెళ్లిందని… అలాగే సినిమాల్లో హీరోయిన్ గా కనుమరుగు అయిపోయిందన్న టాక్ వచ్చింది. అయితే ఇప్పుడు ఆమె మన మధ్య లేకపోవడం దురదృష్టకరం.
తమిళ్ స్టార్ హీరో శింబు, లేడీ సూపర్‌స్టార్ నయన్ వీరిద్దరి గురించి తమిళ ఇండస్ట్రీ కోడై కూసింది. అయినా శింబు సంగతి సరే సరి ఈ సారు దాదాపు అందరు స్టార్ హీరోయిన్లతో ఫ్రెష్ గా ప్రేమాయణాలు నడుపుతాడని… అంతే ఈజీగా వాటిని కట్ చేసేస్తాడని అంటుంటారు. అలాగే నయన్‌తో కూడా బ్రేక్ అప్ అయిందని టాక్. ఆ తర్వాత మళ్లీ నయనతార ప్రభుదేవాతో దాదాపుగా మ్యారేజ్ వరకు వెళ్ళిపోయింది. తన భార్యకు భారీగా భరణం ఇచ్చి మరి వదిలించుకున్నారు ప్రభుదేవా. అయితే ఏమయ్యిందో ఏమో కానీ నయనతారని పెళ్లి చేసుకోలేదు. వీరిద్దరి మధ్య రిలేషన్ కట్ అయింది.
ఇక అక్కినేని ఫ్యామిలీ అంటే ఇండస్ట్రీలో ఒక స్పెషల్ స్టేటస్ ఉంది. అలాగే హీరో నాగార్జున తనయులు నాగ చైతన్య, అఖిల్ బ్రేకప్ లు కూడా సంచలనం సృష్టించాయి. ముందుగా అఖిల్ తాను ప్రేమించిన అమ్మాయి శ్రేయ భూపాల్ తో వైభవంగా నిశ్చితార్దం చేసుకుని ఆ తరవాత రద్దు చేసుకున్నాడు. ఆ తర్వాత టాలీవుడ్ బ్యూటిఫుల్ కపుల్ సమంత , నాగ చైతన్య కూడా విడాకులు తీసుకుని విడిపోయారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఈ స్టార్ కి ఎంత క్రేజ్ ఉందో… అలాగే ఈయన మూడు పెళ్లిళ్ల గురించి ఫ్యాన్స్‌లో అంతే బాధ కూడా ఉంది. ఏకంగా మూడు పెళ్లిల్లు చేసుకున్న పవన్ మొదట నందిని, ఆ తరవాత రేణు దేశాయ్‌కి విడాకులు ఇచ్చి ఇపుడు రష్యా అమ్మాయి అన్నా లెజ్నోవాను పెళ్ళి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి పిల్లలు కూడా ఉన్నారు. ఇక విశాల్.. వరలక్ష్మీ శరత్ కుమార్ , అలాగే గీతాంజలి ఫేం అయిన తెలుగమ్మాయి అంజలి, జై కూడా లవ్ లో మునిగి ఆ తరవాత బ్రేక్ అప్ చెప్పుకుని విడిపోయారు.