ReviewsTL రివ్యూ: బీస్ట్‌

TL రివ్యూ: బీస్ట్‌

కోలీవుడ్ స్టార్ హీరో విజ‌య్ న‌టించిన బీస్ట్ ఈ రోజు ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. విజ‌య్ – పూజా హెగ్డే జంట‌గా న‌టించిన ఈ సినిమాను స‌న్ పిక్చ‌ర్స్ సంస్థ భారీ బ‌డ్జెట్‌తో నిర్మించింది. రు. 120 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్‌తో ఈ రోజు పాన్ ఇండియా లెవ‌ల్లో రిలీజ్ అయిన ఈ సినిమాకు నెల్స‌న్ దిలీప్ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. భారీ అంచాన‌ల‌తో విజ‌య్ మాస్ట‌ర్ త‌ర్వాత రిలీజ్ అయిన ఈ సినిమా ఎలా ఉందో TL స‌మీక్ష‌లో చూద్దాం.

స్టోరీ :
వీర రాఘవ (విజయ్) రా ఏజెంట్‌గా ఉంటాడు. ఉమ‌ర్ అనే టెర్ర‌రిస్ట్‌ను ప‌ట్టుకునే మిష‌న్‌ను రాఘ‌వ లీడ్ చేస్తూ ఉంటాడు. ఈ విజ‌య‌వంత‌మైన ఆప‌రేష‌న్లో ఓ చిన్న పాప చ‌నిపోవ‌డంతో త‌న వ‌ల్లే అని బాధ‌ప‌డుతూ రాఘ‌వ రా నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి రావ‌డంతోనే ప్రీతి ( పూజా హెగ్డే) తో ప్రేమ‌లో ప‌డ‌తాడు. చెన్నైలో ఈస్ట్‌కోస్ట్ మాల్‌ను టెర్ర‌రిస్టులు ముట్ట‌డించి ఉమ‌ర్‌ను రిలీజ్ చేయాల‌ని కండీష‌న్ పెడ‌తారు. అప్పుడు రాఘ‌వ ఆ మాల్లోనే ఉంటాడు. రాఘ‌వ ప్ర‌జ‌ల‌ను ఎలా ? కాపాడాడు. అన్న‌దే మిగిలిన క‌థ‌.

విశ్లేష‌ణ :
విజ‌య్ గ‌త సినిమాల కంటే కాస్త భిన్నంగా టెర్ర‌రిస్ట్ నేప‌థ్యంలో, యాక్ష‌న్‌, మైండ్ గేమ్ డ్రామాతో ఈ సినిమా క‌థ రాసుకున్నారు. విజ‌య్ లుక్ ప్రెష్‌గా ఉంది. రా ఏజెంట్‌గా విజ‌య్ న‌ట‌న సినిమాకే హైలెట్‌. పూజ‌తో ప్రేమ‌లో ప‌డే సీన్లు, కెమిస్ట్రీ బాగానే కుదిరింది. ద‌ర్శ‌కుడు నెల్స‌ర్ రాసుకున్న మెయిన్ టెర్ర‌రిస్ట్ నేప‌థ్యం, యాక్ష‌న్ సీన్లు, మాల్‌లో విజ‌య్ – యోగిబాబు కామెడీ బాగుంది. ఫ‌స్టాఫ్ అంచ‌నాల‌కు త‌గ్గ‌దు. ఇక సెకండాఫ్‌లో కొన్ని సీన్ల వ‌ర‌కు ద‌ర్శ‌కుడి హార్డ్ వ‌ర్క్ క‌నిపించినా… స‌గం దాటాక రొటీన్ బోరింగ్ సినిమా అయిపోయింది.

సినిమా మెయిన్ పాయింట్ బాగున్నా.. క‌థ‌లో డెప్త్ లేదు. క‌థ‌నం కూడా రెగ్యుల‌ర్‌గానే ఉంది. దీంతో ఓ మాస్ మ‌సాలా మూవీగా బీస్ట్ మిగిలిపోయింది. కొన్ని సినిమాలు మ‌రీ సినిమాటిక్‌గా అనిపిస్తాయి. చెన్నై లాంటి పెద్ద న‌గ‌రంలో టెర్ర‌రిస్టులు ఓ మాల్‌ను హైజాక్ చేసేసి.. దాని చుట్టూ క‌థ న‌డిపించేయ‌డం.. సినిమాలో హైజాక్‌ను చూపించినంత దారుణ ప‌రిస్థితులు అస‌లు ఇప్పుడు జ‌రుగుతాయా ? అని ప్ర‌తి ఒక్క‌రికి అనిపిస్తుంది.

సినిమాలో కొన్ని సోష‌ల్ ఎలిమెంట్స్‌, స్టైలీష్ టేకింగ్ ఉన్నా నాట‌కీయ‌త మ‌రీ ఓవ‌ర్ అయిపోయింది. స్క్రీన్ ప్లే కూడా బోరింగ్‌గా మారింది. హీరో – హీరోయిన్ల ల‌వ్ ట్రాక్ కూడా రొటీనే.. హీరోయిన్ పాత్ర బ‌లం లేకుండా నిస్సారంగా మారింది. టెక్నిక‌ల్‌గా ద‌ర్శ‌కుడు నెల్స‌న్ క‌మ‌ర్షియ‌ల్ అంశాల‌కు, సోష‌ల్ ఎలిమెంట్స్ మిక్స్ చేసి క‌థ రాసుకున్నాడు. క‌మ‌ర్షియ‌ల్ ఫార్మాట్లో తెర‌కెక్కిన ఓ రొటీన్ సినిమా చూస్తున్న ఫీలింగే మ‌న‌కు క‌లుగుతుంది.

సంగీతంలో ఇప్ప‌టికే పాపుల‌ర్ అయిన పాట‌ల‌తో పాటు నేప‌థ్య సంగీతం బాగుంది. సినిమాటోగ్రాఫ‌ర్ ప‌నిత‌నం తెర‌మీద ప్ర‌తి రూపాయి ఖ‌ర్చును చూపించింది. ప్ర‌తి ఫ్రేమ్ చాలా ఎఫెక్టివ్‌గా తీశాడు. స‌న్ పిక్చ‌ర్స్ వారి నిర్మాణ విలువ‌లు ఎక్స్‌లెంట్‌.

ఫైన‌ల్‌గా…
భారీ అంచనాల మధ్య పక్కా యాక్షన్ డ్రామాతో బీస్ట్‌గా వ‌చ్చిన ఈ సినిమా చాలా చోట్ల లాజిక్ మిస్ అయిపోయింది. కేవ‌లం యాక్ష‌న్ సీక్వెన్స్ కోస‌మే అన్న‌ట్టుగా ఉంది. సింపుల్ స్టోరీ, రొటీన్ స్క్రీన్ ప్లే సినిమాకు మైన‌స్ అయ్యాయి. కేవ‌లం విజ‌య్ ఫ్యాన్స్ మాత్ర‌మే మెచ్చే యాక్ష‌న్ ఫ్యాక్డ్ ఈ బీస్ట్‌. మిగిలిన వాళ్ల‌కు రొటీన్ బోరింగ్ సినిమాయే..!

బీస్ట్ TL రేటింగ్‌: 2.25 / 5

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news