అబ్బ మూడేళ్ల నుంచి చిరు అభిమానులు మాత్రమే కాదు.. మెగా అభిమానులు అందరూ ఆచార్య సినిమా ఎప్పుడు వస్తుందా ? అని ఒక్కటే ఉత్కంఠతో ఎదురు చూస్తూ వచ్చారు. ఈ సినిమా గురించి ట్విస్టులు ఒక్కోటి రివీల్ చేసుకుంటూ వచ్చి ఎక్కడా హైప్ తగ్గకుండా జాగ్రత్త పడ్డాడు కొరటాల. ముందుగా హీరోయిన్ ఎవరన్నది దాచి దాచి చివరకు కాజల్ పేరు రివీల్ చేశారు. ఆ తర్వాత టైటిల్ విషయంలోనూ ఊరించి ఊరించి ఆచార్యగా పెట్టారు.
ఇక సంగీత దర్శకుడి విషయంలోనూ అంతే జరిగింది. ఇక చెర్రీ ఉంటాడా ? ఉండడా ? అన్నది కూడా ఎంతో తీవ్రమైన ఉత్కంఠకు కారణమైంది. ఇక రిలీజ్ విషయంలోనూ ఊరిస్తూనే వచ్చాడు. ఎట్టకేలకు ఈ నెల 29న థియేటర్లలోకి వస్తోంది. ఈ క్రమంలోనే ఈ సినిమా ట్రైలర్‌ను కూడా ఒకటికి రెండు సార్లు వాయిదా వేసి ఎట్టకేలకు మంగళవారం రిలీజ్ చేశారు.
ట్రైలర్లో కొరటాల మార్క్‌కు భిన్నంగా యాక్షన్ సీక్వెన్స్‌తో నింపేశారు. కొరటాలకు ఓ స్టైల్ ఉంటుంది. అతడి రచనలో ఓ పదును ఉంటుంది. ఓ ఎమోషనల్ టచ్ ఉంటుంది.. ఇక గ్రాండియర్, యాక్షన్ గురించి చెప్పక్కర్లేదు. అయితే ట్రైలర్లో వాటికన్నా కూడా యాక్షన్ డామినేషన్ స్పష్టంగా కనిపించింది. అయితే కావాలనే సినిమాపై అంచనాలు తగ్గించేందుకు వాటిని దాచేశారా ? అన్న సందేహాలు కూడా వస్తున్నాయి.
ఇటీవల ప్రేక్షకుల అభిరుచి ప్రకారం చూస్తే ఎక్కువుగా కొట్టుడు అన్న కాన్సెఫ్ట్నే అందరూ ఫాలో అవుతున్నారు. కొరటాల కూడా అదే స్టైల్లో ట్రైలర్ కట్ చేయించారా అనిపించేలా ఉంది. అఖండ, కేజీయఫ్ స్టైల్లోనే యాక్షన్ సీన్లు, కట్స్ ఎక్కువుగా ఉన్నాయి. ఇక కథ ఏంటన్నది దాదాపు ఓ క్లారిటీ వచ్చేసింది. ఇక కొరటాల సినిమాల్లో హీరోయిన్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యం ఉండదు. ఈ సినిమాలోనూ పూజ, కాజల్‌కు స్కోప్ ఉన్నట్టు కనపడలేదు.
అయితే ఓ సస్పెన్స్‌ను మాత్రం కొరటాల చాలా బాగా దాచాడు అనిపించింది. అసలు ఈ సినిమాకు హీరో చరణా ? చిరంజీవా ? గెస్ట్ ఎవరు చిరునా.. చెర్రీనా అన్నది అయితే ట్రైలర్లో అర్థం కాకుండా బాగా సస్పెన్స్ ఉంచారు. ఇదే ట్రైలర్‌కు మెయిన్ హైలెట్ అని చెప్పుకోవాలి.