సినిమా రంగంలో కథలు చేతులు మారిపోతూ ఉంటాయి. ఒక హీరో నటించాల్సిన సినిమా కొన్ని కారణాల వల్ల చేతులు మారి మరో హీరో చేయాల్సి వస్తుంది. ఇలా చేసిన సినిమాల్లో కొన్ని హిట్ అవుతుంటాయి.. మరికొన్ని ఫెయిల్యూర్ అవుతూ ఉంటాయి. ఇక కొన్ని సినిమాలు ఎంతో అట్టహాసంగా ప్రారంభమై కూడా షూటింగ్ మధ్యలోనే ఆగిపోతూ ఉంటాయి. సినిమా బడ్జెట్ సమస్యల వల్ల కావచ్చు.. హీరోకు, దర్శకుడికి మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల ఇలా కారణం ఏదైనా ఎంతో అట్టహాసంగా స్టార్ట్ అయిన సినిమా మధ్యలోనే ఆగిపోతే ఫ్యాన్స్ బాగా డిజప్పాయింట్ అవుతూ ఉంటారు.
పవర్‌స్టార్ పవన్ కళ్యాన్ నటించిన 5 సినిమాలు షూటింగ్ మధ్యలోనే ఆగిపోయాయి. భారీ అంచనాలు, భారీ కాంబినేన్లతో స్టార్ట్ అయిన ఈ సినిమాలు ఏవేంటి ? ఎందుకు ఆగిపోయాయో చూద్దాం.
1- సత్యాగ్రహి:
సత్యాగ్రహి అనే టైటిల్‌తో పవన్ సినిమా చేస్తున్నాడని టైటిల్ ఎనౌన్స్‌మెంట్ వచ్చిన వెంటనే ఈ సినిమా హైప్ ఎక్కడికో వెళ్లిపోయింది. పవన్ స్వీయ దర్శకత్వంలో ఈ సినిమా స్టార్ట్ చేశారు. అయితే పవన్ డైరెక్ట్ చేసిన జానీ సినిమా డిజాస్టర్ అయ్యింది. దీంతో పవన్ మరోసారి తాను దర్శకత్వం వహించే రిస్క్ చేయలేకపోయాడు. అయితే ఈ టైటిల్ ఇంకా పవన్ పేరిటే రిజిస్టర్ అయ్యి ఉంది. ఈ టైటిల్ పవన్ ఇమేజ్‌కు, వ్యక్తిత్వానికి కరెక్టుగా సూట్ అవుతుందని అనేవారు.
2- దేశి :
పవన్ హీరోగా దేశి టైటిల్‌తో ఓ సినిమా అనుకున్నారు. ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా పూర్తయ్యింది. సినిమా సెట్స్ మీదకు వెళుతోందనుకుంటోన్న టైంలో అనివార్య కారణాలతో ఈ సినిమా స్టార్ట్ కాలేదు.
3- ప్రిన్స్ ఆఫ్ పీస్ :
విభిన్న చిత్రాల దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో ఏసు క్రీస్తు జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించాలనుకున్నారు. 2010లో కొమరం పులి రిలీజ్ అయ్యాక ఈ సినిమా అనుకున్నారు. ఓ షెడ్యూల్ కూడా పూర్తయ్యింది. జెరూసలేంలో కొన్ని సీన్లు షూట్ చేశారు. కొన్ని స్టిల్స్ కూడా బయటకు వచ్చాయి. సడెన్‌గా ఈ సినిమా ఆగిపోయింది.
4- కోబలి :
పవన్ కళ్యాన్ – త్రివిక్రమ్ కాంబోలో 2013లో వచ్చిన అత్తారింటికి దారేది లాంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత కోబలి పేరుతో సినిమా ఎనౌన్స్ చేసేశారు. సోషియో ఫాంటసీ కథాంశంతో ఈ సినిమాను ప్లాన్ చేశారు. త్రివిక్రమ్ ఈ సినిమాను ఎలాగైనా తీయాలని పదే పదే చెప్పారు. అయితే స్క్రిఫ్ట్ దశలోనే సినిమా ఆగిపోయింది.
5- చెప్పాలని ఉంది:
బద్రి సినిమా హిట్ అయ్యాక పవన్ కళ్యాణ్ – అమీషా పటేల్ కాంబినేషన్ అంటే యూత్‌లో పిచ్చ క్రేజ్ ఉండేది. ఈ క్రమంలోనే మరోసారి పవన్ – అమీషా కాంబినేషన్ రిపీట్ చేస్తూ చెప్పాలని ఉంది టైటిల్‌తో సినిమా ఎనౌన్స్ అయ్యింది. ఆ తర్వాత పట్టాలు ఎక్కలేదు. అయితే ఇదే టైటిల్‌తో మరో సినిమా వచ్చేసింది.