ఆచార్య.. మెగాస్టార్ చిరంజీవి మూడున్నరేళ్ల లాంగ్ గ్యాప్ తీసుకుని చేసిన సినిమా ఆచార్య. సైరా నరసింహారెడ్డి తర్వాత చిరు చేసిన సినిమా కావడంతో పాటు తొలిసారిగా చిరు – చెర్రీ జోడీ కట్టిన సినిమా… అటు బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ భరత్ అనే నేను తర్వాత తీసిన సినిమా కావడంతో ఆచార్యపై అంచనాలు అయితే మామూలుగా లేవు. ఆచార్య టీజర్, ట్రైలర్ కూడా మాంచి ప్రామిసింగ్ గానే ఉన్నాయి. దీనికి తోడు వరల్డ్ వైడ్‌గా రు. 150 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరగడంతో సినిమా సూపర్ హిట్ అవుతుందనే అంటున్నారు.
ఆచార్య ఈ నెల 29న వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్ అవుతోంది. తాజాగా హైదరాబాద్‌లో జరిగిన ప్రి రిలీజ్ ఈవెంట్ గ్రాండ్‌గా జరిగింది. ఈ సినిమా టీజర్లు, ట్రైలర్లు చూశాక ట్రేడ్ వర్గాల్లో సైతం భారీ హిట్ అవుతుందన్న ధీమా అయితే కనిపిస్తోంది. మెగాస్టార్, తనయుడు రామ్‌చరణ్ కలిసి నటించిన సినిమా కావడంతో ఈ సినిమా బడ్జెట్ ఎంత అయ్యి ఉంటుంది ? ఈ ఇద్దరి రెమ్యునరేషన్లు ఎంత అన్నది సహజంగానే ఆసక్తి ఏర్పడింది.
అయితే ప్రి రిలీజ్ ఈవెంట్లో ఈ సినిమా నిర్మాత మరియు మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ వ్యవస్థాపకుడు నిరంజన్ రెడ్డి పలు ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ఈ సినిమాను చిరంజీవి, రామ్‌చరణ్ ప్రీ ఆఫ్ కాస్ట్ చేశారని.. వారి రెమ్యునరేషన్ల గురించి నడుస్తోన్న చర్చ అంతా అబద్ధం అని చెప్పాడు. ఆచార్య సినిమాకు తమ హీరోలు ఎలాంటి డబ్బు తీసుకోలేదని సినిమా రిలీజ్ అయ్యాక వచ్చే ఫలితం, లాభాల ఆధారంగానే రెమ్యునరేషన్లు చూద్దామని మాకు భరోసా ఇచ్చారంటూ నిరంజన్ రెడ్డి చెప్పారు.
మామూలుగా చరణ్ ఒక్కో సినిమాకు రు. 25 – 30 కోట్ల రేంజ్‌లో రెమ్యునరేషన్ తీసుకుంటూ వస్తున్నాడు. అయితే త్రిబుల్ ఆర్ సినిమాకు రాజమౌళి ఎన్టీఆర్, చెర్రీ ఇద్దరికి చెరో రు. 45 కోట్ల రెమ్యునరేషన్ ఇప్పించాడు. ఇక చిరు ఖైదీ నెంబర్ 150, సైరా సినిమాలు సొంత కంపెనీ కొణిదెల ఎంటర్టైన్‌మెంట్స్‌లోనే చేశాడు. అయితే ఇప్పుడు బయట బ్యానర్లలో చేస్తోన్న సినిమాకు రు. 50 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు టాక్ ?
ఒకవేళ ఈ ఇద్దరు హీరోలకు రెమ్యునరేషన్ ఇవ్వాలనుకుంటే అవే రు. 80 కోట్ల వరకు సమర్పించుకోవాలి. అప్పుడు బడ్జెట్ తడిసి మెపెడు అయిపోతుంది. ఇప్పుడు ఈ ఇద్దరు ప్రీ ఆఫ్ కాస్ట్‌లో చేయడంతో నిర్మాతలు ఫ్రీగా సినిమా రిలీజ్ చేస్తున్నారు. మరి ఆచార్య రిజల్ట్ ఎలా ? ఉంటుందో ? చూడాలి.