ఆమె ఓ స్టార్ హీరోయిన్.. తెలుగు, కన్నడ,తమిళ, హిందీ భాషలల్లో సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉంది. మన ఇండస్ట్రీలో కూడా అమ్మడుకి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. బడా బడా స్టార్ హీరోలు సైతం ఆమె తో నటించడానికి ఇష్టపడుతుంటారు. అందానికి అందం..నటనకి నటన..ఎక్స్ పోజింగ్ విషయంలో కూడా అస్సలు మొహమాటపడకుండా చేస్తుంది. ఈ మధ్యనే టాలీవుడ్ బడా స్టార్ హీరో సినిమాల్లో నటించి మంచి మార్కులు వేయించుకుంది. ఆమె నటించిన మరో సినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉండగా..మరో నాలుగు సినిమాలు చేతుల్లో పట్టుకుని ఉంది.
సినిమా ల పరంగా అమ్మడు ను వేలు ఎత్తి చూపడానికి ఏం లేదు కానీ..ఇండస్ట్రీలో అమ్మడుకి సంబంధించిన ఓ వార్త గత కొన్ని రోజులు గా నెట్టింట తెగ హల్ చల్ చేస్తుంది. గత కొంత కాలంగా టాలీవుడ్ బడా హీరో తమ్ముడితో ప్రేమలో ఉన్న ఈ బ్యూటీ.. మొన్న ఈ మధ్య ఆయన పుట్టినరోజు సంధర్భంగా ఏకంగా ఇంటికే వెళ్లి విష్ చేసిందట. అది కూడా అర్ధరాత్రి సమయంలో. దీంతో హీరో తమ్ముడు సర్ ప్రైజ్ అయినా..హీరో మాత్రం షాక్ అయ్యాడట. ఎందుకంటే అన్నా సినిమా లో నటించేటప్పుడే ఆమెకు ఓ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడంటూ..హీరోయిన్ పాప క్లారిటీ ఇచ్చిందట.
మరీ, మా తమ్ముడితో ఈ ప్రేమ లీలకు ఏంటో అని అర్ధంకాక కాసేపు కన్ఫ్యూజ్ అయిన హీరో..అసలు మ్యాటర్ ఏంటి మొత్తం తమ్ముడికి చెప్పగా.. రియాలైజ్ అయిన బ్రదర్..హీరోయిన్ ని తిట్టిపోశాడట. అంతేకాదు నాలుగు ఐదు డాష్ డాష్ బూతులు తిట్టి.. నీలాంటి ఆడదాని..ఏం అంటారో తెలుసా,,అంటూ పచ్చి బూతులు మాట్లాడారట. ఇక సెన్సిటివ్ నేచర్ అయిన హీరో తమ్ముడు .. డిప్రేషన్ లోకి వెళ్ళాడని..ప్రస్తుతం హైదరాబాదులోనే ఓ డాక్టర్ దగ్గర ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారని వార్తలు వైరల్ అవుతున్నాయి.