బాహుబలి ఈ పేరు వింటేనే తెలుగు గడ్డపై ప్రతి ఒక్కరి రోమాలు నిక్కపొడుచుకుని ఉంటాయి. అసలు ఈ సినిమా ఓ సంచలనం. అసలు రాజమౌళి ఈ సినిమాను స్టార్ట్ చేసినప్పుడు ఒక్క పార్ట్‌గానే తీయాలని అనుకున్నారు. సినిమా సగం షూటింగ్ అయ్యాక 4 గంటలకు పైనే వస్తోందని అర్థమైంది. దానికి ఒక్క పార్ట్‌గా చూపించడం ఇష్టంలేకే రెండు పార్టులుగా తీశారు. కట్ చేస్తే ఫస్ట్ పార్ట్‌కు మూడింతలు మించి సెకండ్ పార్ట్ హిట్ అయ్యింది. బాహుబలి ది కంక్లూజన్ ఇండియా సినిమా చరిత్రలోనే బిగ్గెస్ట్ హిట్ అయ్యింది. అసలు ఇప్పట్లో ఈ సినిమా వసూళ్లను దాటే సినిమా ఏదీ కూడా కనుచూపు మేరలో కనపడడం లేదు.
ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇంత పెద్ద విజయంలో కనీసం ఒక్క పాత్రలో అయినా మెరిస్తే చాలు అనుకున్న నటీనటులు ఎంతో మంది ఉన్నారు. ఈ రెండు పార్టుల్లో ఎంతో మంది ప్రముఖ నటీనటులు కనిపించారు. తమిళ నటుడు సత్యరాజ్, కన్నడ నటుడు సుదీప్, నాజర్, రానా, అడవి శేష్, రాజమౌళి, ప్రభాస్, తమన్నా, అనుష్క, రమ్యకృష్ణ ఇలా భారీ స్టార్ కాస్టింగ్ అంతా ఈ సినిమాలో కనిపించారు.
ఈ సినిమాలో కొడుకు బాహుబలికి ప్రియురాలిగా రాణి అవంతిక నటించారు. ఈ సినిమాలో అవంతిక పాత్రకు మంచి ప్రాధాన్యమే దక్కింది. బాహుబలి ది బిగినింగ్‌లో అవంతిక పాత్రను చక్కగా మలిచాడు జక్కన్న. అయితే ఈ మంచి పాత్రను మరో యంగ్ హీరోయిన్ మిస్ చేసుకుందట. ఊహలు గుసగుసలాడే వేళ సినిమాతో టాలీవుడ్‌కు హీరోయిన్‌గా పరిచయం అయ్యింది రాశీఖన్నా. తక్కువ టైంలోనే టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్‌లోనూ మంచి హిట్లు కొట్టేసింది.
తెలుగులో జై లవకుశ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్‌కు కూడా జోడీగా నటించింది. అసలు ఆమెను ముందుగా బాహుబలిలో తమన్నా పోషించిన పాత్ర కోసం అడిషన్స్ చేశారట రాజమౌళి. ముందుగా ఆమెను ఓకే అనుకున్నా.. తర్వాత ఆమె సూట్ కాదని భావించి.. ఆ ప్లేసులో తమన్నాను తీసుకుని.. రాశీఖన్నాను ఊహలు గుసగుసలాడే వేళ సినిమాకు రిఫర్ చేశారట.
అలా ఆ సినిమాలో ఆమె హీరోయిన్‌గా ఎంపికైంది. ఈ విషయాన్ని ఆమే స్వయంగా చెప్పింది. ఏదేమైనా ఓ మాంచి క్రేజీ ప్రాజెక్టులో నటించే ఛాన్స్ ఆమె దురదృష్టంతో మిస్ అయ్యింది. అయితే రాశీ టాలీవుడ్‌లోనే కాదు అటు తమిళంలోనూ తనదైన ముద్ర వేసేలా సినిమాల్లో నటించింది. కెరీర్ స్టార్టింగ్‌లోనే రాశీఖన్నా బాహుబలి సినిమా చేసి ఉంటే ఖచ్చితంగా ఆమె రేంజ్ మరోలా ఉండేది.