భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన కేజీయఫ్ చాప్టర్ 2 మానియాలో ఇండియన్ సినిమా ప్రేక్షకుడు మునిగి తేలుతున్నాడు. ఇప్పుడు ఇటు కోయంబత్తూర్ నుంచి అటు కర్నాకట.. నార్త్‌లో కశ్మీర్ వరకు ఎవరి నోట విన్నా కూడా కేజీయఫ్ 2 మాటే వినిపిస్తోంది. వాస్తవంగా చూస్తే కథలో పెద్దగా మలుపులు లేకపోయినా కూడా ఎలివేషన్లతో పాటు మిగిలిన ఎలిమెంట్స్‌తో దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రేక్షకులను సీట్లకు కట్టిపడేశాడు. యునానమస్‌గా ఇండియా టు అమెరికా, దుబాయ్ వరకు సినిమాకు బ్లాక్‌బస్టర్ టాక్ అయితే వచ్చేసింది.
యశ్ స్క్రీన్ ప్రెజెన్స్‌కు బాషతో సంబంధం లేకుండా ప్రతి ఒక్క సినీ అభిమాని మంత్ర ముగ్ధుడు అయిపోతున్నాడు. సౌత్‌లో కథ పరంగా చాప్టర్ 1తో పోలిస్తే కాస్త తగ్గింది అన్న కంప్లైంట్ మినహా ఎవ్వరూ కూడా పెద్దగా అభ్యంతరం వ్యక్తం చేయడం లేదు. 3 నుంచి 4 వరకు రేటింగ్‌లు ఇస్తున్నారు. అయితే గత కొద్ది నెలలుగా సౌత్ సినిమాను చూసి బెంబేలెత్తుతోన్న బాలీవుడ్ వాళ్లు, అక్కడ మీడియా మరోసారి కేజీయఫ్ 2పై నెగిటివ్ రివ్యూలతో విరుచుకు పడింది.
దేశం మొత్తం సినిమాను మెచ్చుకుని బ్రహ్మరథం పడుతుంటే.. బాలీవుడ్ తన ఏడుపు మొదలు పెట్టడంతో పాటు సినిమాపై నెగిటివ్ వార్తలతో తొక్కేసే ప్రయత్నం మొదలు పెట్టేసింది. అసలు గత నెలలో వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమాపై కూడా బాలీవుడ్ మీడియా ఇలాగే నెగిటివ్ వార్తలతో విరుచుకు పడింది. అయితే త్రిబుల్ ఆర్ ఒక్క బాలీవుడ్‌లోనే ఏకంగా రు. 200 కోట్లు రాబట్టింది. ఇప్పుడు కేజీయఫ్ 2 విషయంలో కూడా అదే నెగిటివ్ ప్రచారం గట్టిగా చేస్తోంది.
సినిమా అర్థం కాలేదని.. త్రిబుల్ ఆర్ కంటే చెత్త సినిమా ఇదని కొందరు టాప్ మోస్ట్ మూవీ ఎనలిస్టులు సైతం విమర్శలు చేశారంటే వాళ్ల పైత్యం ఎంతలా ఉందో తెలుస్తోంది. బాలీవుడ్ వాళ్లు మంచి సినిమాలు తీయలేరు.. ఎవరైనా మిగిలిన భాషల వాళ్లు మంచి సినిమాలు తీస్తే తట్టుకోలేరు.. దీనిని బట్టే వీళ్ల కుళ్లు ఏ రేంజ్లో ఉందో అర్థమవుతోంది. ఇక బాలీవుడ్‌లోనే ఫస్ట్ డే ఈ సినిమా రు. 40 కోట్లు కొల్లగొడుతుందని ట్రేడ్ వర్గాల అంచనా.
ఇక ఎవరెంత ఏడ్చినా కూడా సినిమాకు తీర్పు ఇచ్చేది అంతిమంగా ప్రేక్షకుడు. బాలీవుడ్ ప్రేక్షకులు కూడా ఈ సినిమా కోసం ఎంతలా ఎదురు చూస్తున్నారో ? అక్కడ అడ్వాన్స్ బుకింగ్‌లే చెప్పేస్తున్నాయి. సో ప్రేక్షకుడు ఇచ్చే అంతిమ అద్భుత తీర్పు ముందు ఈ కుళ్లి నాయాళ్ల కల్లిబొల్లి మాటలు ఉఫ్..!