Moviesకెరీర్లో సరిదిద్దుకోలేని తప్పు చేసిన తాప్సీ..ఇప్పటికి బాధపడుతుందట..?

కెరీర్లో సరిదిద్దుకోలేని తప్పు చేసిన తాప్సీ..ఇప్పటికి బాధపడుతుందట..?

మన పెద్దవాళ్ళు మనకు ఎప్పుడు ఒక్క మాట చెప్పుతుంటారు. మనం తీసుకునే నిర్ణయాలే మన భవిష్యత్తుకి పునాది. కోపంలో ఒక్క తప్పుడు నిర్ణయం తీసుకుంటే ఆ తరువాత దాని ఎఫెక్ట్ నువ్వే భరించాలి. ఈ విషయం మన లైఫ్ లో ఎవ్వరో ఒకరు చెప్పే ఉంటారు. కానీ మనం అప్పుడు సరదా గా తీసుకుని ఉంటాం. కానీ ఆ టైం వచ్చిన్నపుడు ఆ బాధ తెలుస్తుంది. ఇప్పుడు అదే బాధని అనుభవిస్తుందట ఢిల్లి ముద్దుగుమ్మ తాప్సి.

సినిమా ల పై ఉన్న ఇంట్రెస్ట్ తో ఇండస్ట్రీలోకి వచ్చి అదృష్టమో..కష్టమో మంచి సినిమాలను లైన్లో పెట్టి..తక్కువ టైంలోనే మంచి మంచి హిట్స్ తన ఖాతాలో వేసుకుంది. ఝుమ్మంది నాదం సినిమాతో తన లేలేత అందాలను కుర్రాళ్లకు పరిచయం చేసిన్ తాప్సీ..ఆ తరువాత తెలిసి తెలీయని తనంతో టాలీవుడ్ టాప్ దర్శకుడితో గొడవ పెట్టుకుని..సినిమా అవకాశాలు చేజార్చుకుందని..అప్పట్లో మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. టాలీవుడ్ బడా డైరెక్టర్ తో ఓ సినిమాకు కమిట్ అయిన తాప్సీ..ఆ తరువాత వేరే సినిమా ఓకే కావడంతో డేట్లు అడ్జెస్ట్ చేయలేక తీసుకున్న అడ్వాన్స్ డబ్బులు వెనక్కి ఇచ్చేస్తానని చెప్పిందట.

కానీ, కుదరదు నా సినిమాలో చెయ్యాల్సిందే అని డైరెక్టర్ కోపంగా మాట్లాడటంతో..తాప్సీ కూడా టంగ్ స్లిప్ అయ్యిందట.. కొంచెం రాష్ గా మాట్లాడటంతో వ్యవహారం ముదురి ..ఓ సీనియర్ హీరో వరకు వెళ్లి…ఫైనల్ గా గుట్టుచప్పుడు కాకుండా మ్యాటర్ క్లోజ్ చేసుకున్నారట. అప్పటి జరిగిన ఆ ఇష్యూ కారణంగా తాప్సీ తెలుగు సినిమాలకు దూరంగా ఉందనే ఓ రూమర్ కూడా ఉంది. నిజానికి ఈ విషయంలో తప్పు తాప్సీ దే అంటారు అందరు..కానీ ఆ డైరెక్టర్ కూడా ఆడవాళ్ల తో అంత నీచంగా మాట్లాడి ఉండకూడదు అని మరికొందరు అంటారు. ఫైనల్ గా చాలా కాలం తరువాత తాప్సీ మళ్ళీ తెలుగు సినిమా చేసింది కానీ..ఫ్లాప్ అయ్యింది. మరి ఇప్పుడు ఏం చేస్తుందో ఈ బ్యూటీ..?

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news