2007లో వచ్చిన హ్యాపీడేస్ సినిమాతో పాపులారిటీ దక్కిచుకుంది తమన్నా. ఆ తర్వాత తక్కువ టైంలోనే ఆమె మిల్కీబ్యూటీగా పాపులర్ అయ్యింది. తక్కువ టైంలోనే స్టార్ హీరోలు అందరితోనూ కలిసి నటించి హిట్లు కొట్టింది. అసలు పదేళ్లకు పైగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో తమన్నాకు తిరుగులేకుండా పోయింది. మహేష్ బాబు – ఎన్టీఆర్ – రామ్ చరణ్ – పవన్ కళ్యాణ్ – ప్రభాస్ – చిరంజీవి – నాగ చైతన్య ఇలా ఎంతో మంది సీనియర్, జూనియర్ స్టార్ హీరోలతో బ్రేక్ లేకుండా చేసేసింది తమన్నా.
అందమే కాదు.. అటు అభినయం.. డ్యాన్సులు అన్నీ తమన్నా సొంతం. అయితే ఇటీవల కాలంలో తమన్నా ఏజ్ బార్ అవ్వడంతో కాస్త డల్ అయ్యిందన్నది వాస్తవం. అయితే ఈ వయస్సులోనూ ఆమె బాక్సాఫీస్ దగ్గర హడావిడి చేసే సత్తా అయితే ఆమెకు ఉంది. పైగా సీనియర్ హీరోలకు తమన్నా పెద్ద ఆప్షన్ అయిపోయింది. ఇప్పటకీ వెంకీ పక్కన ఎఫ్ 2తో పాటు ఎఫ్ 3 సినిమాల్లో నటిస్తోంది.
అటు చిరంజీవి పక్కన భోళా శంకర్ సినిమా చేస్తోంది. నాగార్జున లాంటి ముదరు హీరోల పక్కన కూడా ఫస్ట్ తమన్నా పేరే బెస్ట్ చాయిస్గా వినిపిస్తోంది. గత కొంత కాలంగా తమన్నా పెళ్లి గురించి వార్తలు అయితే మీడియాలో వస్తున్నాయి. అయితే ఈ వార్తలు నిజం కాబోతున్నట్టు తెలుస్తోంది. హీరోయిన్గా ముదురు హీరోలు తప్పా ఆమెకు ఛాన్సులు ఇచ్చే వాళ్లు కనపడడం లేదు.
ఈ క్రమంలోనే ఆమెకు ఇంట్లో వాళ్లు పెళ్లి చేసేయాలని ఫిక్స్ అయ్యారు. ఇది ఎప్పటి నుంచో జరుగుతోంది. అయితే వెంకీ, చిరు లాంటి వాళ్ల పక్కన అనూహ్యంగా ఛాన్సులు రావడంతో ఇది వాయిదా పడుతూ వస్తోంది. పైగా రు. 3 కోట్ల రెమ్యునరేషన్.. ఇంత వయస్సు పై బడినా ఈ రేంజ్ రెమ్యునరేషన్ రావడంతో సహజనంగానే ఎవ్వరూ పెళ్లి చేసుకునేందుకు ఇష్టపడరు.
ఇప్పుడు తమన్నా కూడా అదే చేస్తోంది. అందుకే కొంత కాలం పెళ్లి వాయిదా వేసుకుంటోందట.
2023లో తమన్నా పెళ్లి జరిగే ఛాన్సులు ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఆమెది లవ్ మ్యారేజ్ గట్రా కాదని.. తమన్నా ఫ్యామిలీ వాళ్లకు తెలిసిన అబ్బాయితోనే ఆమె మ్యాచ్ ఫిక్స్ చేశారని అంటున్నారు.