శృతీహాసన్ ఒకప్పుడు స్టార్ హీరోలు అందరితోనూ కలిసి నటించింది. కె. రాఘవేంద్రరావు తనయుడు ప్రకాష్ దర్శకత్వంలో వచ్చిన అనగనగ ఒక ధీరుడు సినిమాలో సిద్ధార్థ్ పక్కన హీరోయిన్గా నటించిన ఈ అమ్మడు తక్కువ టైంలోనే బాగా పాపులర్ అయ్యింది. ఆ తర్వాత తక్కువ టైంలోనే ఎన్టీఆర్, మహేష్‌బాబు, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రామ్‌చరణ్ లాంటి హీరోలతో నటించి హిట్లు కొట్టింది.
ఒక్క పవన్ కళ్యాణ్ ఆమెకు ఏకంగా మూడు సినిమాల్లో ఛాన్సులు ఇచ్చాడు. కాటమరాయుడు, గబ్బర్‌సింగ్, వకీల్‌సాబ్ సినిమాల్లో ఆమె పవన్ పక్కన జోడీ కట్టింది. శృతి రాంగ్ స్టెప్పులు వేసి ఉండకపోతే ఆమె ఇప్పటకీ స్టార్ హీరోయిన్‌గానే ఉండేది. సౌత్‌లో ఆమె స్టార్ హీరోయిన్గా ఉన్నప్పుడు విదేశీ ప్రియుడుతో పీకల్లోతు ప్రేమలో కూరుకుపోయింది. అసలు కెరీర్‌ను పట్టించుకోలేదు.. ఫిజిగ్ బాగా దెబ్బతినేసింది.
దీంతో ఆమెకు ఛాన్సులు ఇచ్చేందుకు ఎవ్వరూ ముందుకు రాలేదు. అటు ప్రియుడితో సహజీవనం మోజులో కెరీర్‌ను స్పాయిల్ చేసుకుంది. అతడితో బ్రేకప్.. తర్వాత తప్పు తెలుసుకున్నా అప్పటికే కుర్ర హీరోయిన్ల పోటీతో నెగ్గుకు రాలేకపోయింది. దీంతో ఇప్పుడు శృతి ఫేడవుట్ అయ్యి.. సీనియర్ హీరోలకు మాత్రమే బెస్ట్ ఆప్షన్ అయ్యింది.
గతేడాది క్రాక్ సినిమాతో హిట్ కొట్టి ఫామ్‌లోకి వచ్చిన శృతి ఇప్పుడు బాలయ్య – మలినేని గోపీచంద్ సినిమాలో, అటు చిరంజీవి సినిమాలో కూడా నటిస్తోంది. ఈ ముదురు హీరోలకే ఇప్పుడు శృతి ఫస్ట్ ఆప్షన్ అయిపోయింది. ఇక కొంత కాలంగా శృతీ శాంతను హజారికాతో సహజీవనం చేస్తోంది. కరోనా టైంలో కూడా వీరు కలిసే ఉన్నారు. తాజాగా శృతి తన ప్రియుడితో షేర్ చేసిన రొమాంటిక్ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ ఫొటోల శృతి చీర కట్టుకుని సాంప్రదాయ దుస్తుల్లో చాలా క్యూట్ లుక్స్‌తో చంపేస్తోంది. అటు ప్రియుడిని వాటేసుకుని ముద్దులు పెడుతోన్న ఫోటోలు చాలా బాగున్నాయి. ఇప్పుడు ఇవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. శృతి ఈ అందం ఏదో నాలుగేదళ్ల క్రితమే మెయింటైన్ చేసి ఉంటే ఆమె ఇప్పుడు సీనియర్ హీరోలతో నెట్టుకు వచ్చే స్థితికి వచ్చేదే కాదు.